Medak | విధాత, మెదక్ బ్యూరో : రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డిలు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానము వద్ద యాగ శాలను వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణ నడుమ సోమవారం ప్రారంభించారు. వన దుర్గామాత సన్నిధిలో మొదటి సారిగా యాగశాలను 42 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇక నుండి నిత్యం […]

Medak |

విధాత, మెదక్ బ్యూరో : రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డిలు మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానము వద్ద యాగ శాలను వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణ నడుమ సోమవారం ప్రారంభించారు.

వన దుర్గామాత సన్నిధిలో మొదటి సారిగా యాగశాలను 42 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇక నుండి నిత్యం యాగం జరగనుంది. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డిలు పాల్గొన్నారు. మంత్రికి రాజగోపురం వద్ద ఈఓ సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

యాగశాలలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డిలు పుణ్యహవచన తదితర పూజల అనంతరం హోమం, పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డిఓ సాయిరాం, ఎఎంసి చైర్మన్ వెంకట్రాం రెడ్డి, ఎంపిపి ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ అధ్యక్షులు బాలాగౌడ్, కొల్చారం ఎంపిపి మంజుల, జడ్పిటిసి మేఘమాల సంతోష్ గడీల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పాపన్నపేట మండల కేంద్రంలో 35 లక్షలతో నిర్మించిన వెటర్నరీ బిల్డింగ్, కోటి 20 విలువైన సీసీ రోడ్డును మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పరారంభించారు. కొత్త లింగయపల్లిలో 20 లక్షలతో గ్రామ పంచాయతి భవనం ప్రారంభించారు. రామతీర్థంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు.

మెదక్ లో పలు అభివృద్ధి పనుల ప్రారంభం

మెదక్ పట్టణంలో సమాఖ్య భవనం,డీసీసీబీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి కలెక్టర్ రాజ హర్ష డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి,హనుమంత్ రెడ్డి, కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

సురక్ష ర్యాలీనీ ప్రారంభించిన మంత్రి

సురక్ష దినోత్సవం లో భాగంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అధ్వర్యంలో సోమవారం సాయంత్రం చేపట్టిన భారీ బైక్, కార్ ర్యాలీ నీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.రాందాస్ చౌరస్తా నుండి సాయి బాలాజీ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ..సీఐ,si పాల్గొన్నారు.

Updated On 6 Jun 2023 1:20 AM GMT
krs

krs

Next Story