Medak | నల్లపోచమ్మకు బోనాలు.. భారీగా పాల్గొన్న మహిళలు బొనమేత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్లొన్న ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌ పర్సన్ లలిత విధాత, మెదక్ బ్యూరో: అమ్మా బెల్లెల్లినాదో.. నాయనా.. తల్లీ బెల్లెల్లినాదో.. అంటూ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ 17 వ బోనాల వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఏడు భిన్న […]

Medak |

  • నల్లపోచమ్మకు బోనాలు.. భారీగా పాల్గొన్న మహిళలు
  • బొనమేత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
  • పాల్లొన్న ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌ పర్సన్ లలిత

విధాత, మెదక్ బ్యూరో: అమ్మా బెల్లెల్లినాదో.. నాయనా.. తల్లీ బెల్లెల్లినాదో.. అంటూ జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ మాత నల్ల పోచమ్మ 17 వ బోనాల వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ ఏడు భిన్న సంస్కృతులతో అలరారుతూ.. నిర్వహించిన బోనాల పండుగ సంబరం అంబరాన్నం టాయి. దాంతో మెదక్ కొత్త శోభ సంతరించుకుంది. డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

పట్టణంలోని నవా పేట, పెద్దబజార్, న్యూమార్కెట్, పిట్లంబేస్, బార హిమామ్, ఫతే నగర్, గాంధీనగర్, దాయర, హౌసింగ్ బోర్డు, ఇందిరా కాలనీ, మిలిటరీ కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, జమ్మికుంట, అజంపుర, సాయినగర్, వెంకట్రావు నగర్, కొలిగడ్డతో పాటు ఆయా వీధులకు చెందిన బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా రాందాస్ చౌరస్తాలో కాంతరా, ఒగ్గు డోలు, ఫుల్ బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ తో దద్దరిల్లింది అనంతరం ఊరేగింపుగా వెళ్లి మాత నల్ల పోచమ్మ దేవాలయం వద్ద బోనాలు సమర్పించారు.

ప్రముఖుల హాజరు..

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పాల్గొనగా.. రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌ పర్సన్ ఆకుల లలిత హాజరై బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోనాల ఊరేగింపులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పలువురిని అలరించాయి.

ఈ ఉత్సవాల్లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, టీఎన్జీవో అధ్యక్షుడు దొంత నరేందర్, మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులు హన్మంతరావు, శివ్వంపేట కల్లూరి హరికృష్ణ, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్,

జిల్లా యువక మండలి కన్వీనర్, కౌన్సిలర్లు బట్టి లలిత, నిర్మల, చందన సుమన్, ఆవారి శేఖర్, ఉత్సవ కమిటీ బృందం కామాటి కృష్ణ, అది వంశీ కృష్ణ, మాడిశెట్టి సుమన్, పెండల నిఖిల్, వీర్ కుమార్, హర్కార్ మహిపాల్, కానుగు పరుశురాం, నల్లాల విజయ్, నాయిని ప్రసాద్, పూల మల్లేష్, గంగులు, బండ నరేష్,

శివకుమార్, వినోద్, శ్రీనివాస్, నర్సింలు, రాజు, గౌతమ్, అవినాష్, రూపేష్, తూర్పు మహేష్, పట్టణ అధ్యక్షుడు గట్టేష్, ఆది బలరాం, బట్టి రమేష్, మెరుగు రాజు, కుల్ల నర్సింలు, అనిల్, శ్రీనివాస్, మెదక్ తోపాటు రాజ్ పల్లి, శివాయిపల్లి, మక్తభూపతిపూర్, తొగిట, కూచన్ పల్లి, అవుసుల పల్లి, తిమ్మక్క పల్లి మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated On 6 Jun 2023 1:53 AM GMT
somu

somu

Next Story