Tuesday, January 31, 2023
More
  Homeక్రైమ్‌సుజాత, సుశీల హత్యకేసును ఛేదించిన మెదక్ పోలీసులు

  సుజాత, సుశీల హత్యకేసును ఛేదించిన మెదక్ పోలీసులు

  • నిందితుడు కౌశిక్ అరెస్ట్
  • 10 తులాల బంగారం రికవరీ
  • ఒంటరి మహిళలే టార్గెట్ గా హత్య.. బంగారు ఆబరణాల చోరీ
  • మెదక్ సీఐ నీ అభినందించిన ఎస్పీ

  విధాత, ఉమ్మడి జిల్లా బ్యూరో: జల్సాలకు అలవాటు పడి వృద్ధులు, ఒంటరి మహిళలను టార్గెట్ చేసి పుస్తెలతాడు, చెవి రింగులు ఎత్తుకెళ్తూ హత్యలు చేస్తున్న యువ హంతకుడిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

   

  శుక్రవారం మెదక్‌లో విలేకరుల సమావేశం ఎర్పాటు చేసి మెదక్ మార్కెట్ సమీపంలో మహిళను హత్యచేసిన వివరాలతో పాటు గతంలో ఒక మహిళను హత్యచేసి తప్పించుకు తిరుగుతున్న నిందితున్ని పట్టు కొని కేసులను ఛేదిoచిన వివరాలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు.

  ఈ నెల 24న జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో పెద్ద బజారులో తలకొక్కుల సుజాతను (45) గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాని ప్రకారం మెదక్ డీఎస్పీ సైదులు మెదక్ పట్టణ సీఐ మెదక్ రూరల్ సీఐలు మధు, విజయ్ విచారణ చేపపట్టారు.

  వెల్దుర్తి మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన సుజాత బ్రతుకుతెరువు కోసం మెదక్‌కు వచ్చి మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. సుజాత మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వెళ్ల‌గా, ఎవరూ లేని సమయంలో వజ్రబోయిన కౌశిక్( 17) సుజాత ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి పుస్తెలతాడు చెవి రింగులు తీసుకొని చీరతో గొంతు నులిమి హత్య చేశాడు.

  ఈ కేసును విచారణ చేస్తుండగా 2017 సంవత్సరంలో ఫిబ్రవరిలో సుశీల అనే మహిళను హత్య చేసి ఆమె వద్దనున్న పుస్తెలతాడు చెవి రింగులు అపహరించినట్లు తెలిపారు. అలాగే 2022 జూన్ లో లక్ష్మీ అనే మహిళపై దాడి చేసి ఆమె చనిపోయిందని భావించి ఆమెపై ఉన్న పుస్తెలతాడును తీసుకొని వెళ్ళాడని ఎస్పీ తెలిపారు.

  నిందితుడి నుండి పది తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి నిందితున్ని రిమాండ్ కు పంపినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. మావేశం లో మెదక్ డీఎస్పీ సైదులు, సిఐలు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular