Medak రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పై రేవంత్ రెడ్డి హామీ ఇప్పిస్తా.. పోరాటాఉ ఉదృతం చేస్తాం.. డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రకటన… విధాత, మెదక్ బ్యూరో: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తేనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షులు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. వచ్చే నెలలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉందని, రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధనకు పిసిసి చీఫ్‌తో హామీ ఇప్పిస్తానని తిరుపతి […]

Medak

  • రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పై రేవంత్ రెడ్డి హామీ ఇప్పిస్తా..
  • పోరాటాఉ ఉదృతం చేస్తాం..
  • డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రకటన…

విధాత, మెదక్ బ్యూరో: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తేనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధ్యమవుతుందని డీసీసీ అధ్యక్షులు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. వచ్చే నెలలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉందని, రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధనకు పిసిసి చీఫ్‌తో హామీ ఇప్పిస్తానని తిరుపతి రెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా 2వేల మందితో రెవెన్యూ డివిజన్ సాధన కోసం పోరాటం చేస్తానని వేదిక సాక్షిగా నిరాహార దీక్షలు చేస్తున్న వారికి మద్దతు ప్రకటిస్తూ తిరుపతి రెడ్డి మాట్లాడారు. బిఆర్‌యస్ పాలనను విమర్శించారు.

ఎమ్మెల్యే సమస్యలను గాలికి వదిలేసి ధనార్జననే ముఖ్యంగా ముందుకు సాగుతున్నారని విమర్శించారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడి ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ మాత్రం చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నార‌న్నారు. ఒక వైపు రాష్ట్రంలో కొత్తగా రెవెన్యూ డివిజన్ లు ఏర్పాటు చేస్తున్నా కూడా రామయంపేట రెవెన్యూ డివిజన్ మాత్రం ఏర్పాటు చేయడం లేదు. గతంలో కూడా రెవెన్యూ డివిజన్ కోసం 180 రోజులు దీక్షలు నిర్వహించారు.

నాడు మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన ఇక్కడ మాత్రం ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కానీ మంత్రి మాట తప్పారని విమర్శించారు. రాబోయే 10 రోజుల్లోనే 2వేల మందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేపడతానని ఆయన అన్నారు. వచ్చే నెలలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ఆయనతో హామీ ఇప్పించే బాధ్యత నాదేనని ఆయన అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated On 3 May 2023 2:55 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story