Medak |
విధాత మెదక్ బ్యూరో: కారు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తల్లి కూతురు మృతి చెందారు .ఒకరి పరిస్థితి విషమంగా మారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని అంతారం గేటు సమీపంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే కంచనపల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం అతని భార్య స్వరూప 36 కూతురు శ్రీలత 14 సంవత్సరాలు రాత్రి నర్సాపూర్ మండల్ చిన్న చింతకుంట గ్రామం నుంచి కంచన్పల్లికి బయలుదేరారు.
సేరి తాండ గ్రామపంచాయతీకి చెందిన గిరిజనులు చిలప్ చెడ్ మండల్ సామ్లా తాండాలో విందు కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణంలో అంతారం గేటు దాటిన తర్వాత వెనక నుంచి కారు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న దుంపల స్వరూప ఆమె కూతురు శ్రీలత అక్కడికక్కడే మృతి చెందారు. దుంపల మల్లేశంకు తీవ్ర గాయాలవడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తరలించారు. మల్లేశం పరిస్థితి విషమంగా ఉందని వారి సమీప బంధువులు తెలిపారు. ఈ మేరకు కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.