Medak |
విధాత: పాపన్నపేట్ మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆరెస్ పార్టీ నాయకుడు దుర్గాగౌడ్ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుండి మెదక్ వస్తుండగా మెదక్ జిల్లా కొల్చారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో దుర్గాగౌడ్ సోదరుడు రాజుగౌడ్, ఆయన కుమార్తె 9 నెలల పసిపాప ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న దుర్గా గౌడ్, అతని భార్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన దుర్గాగౌడ్ కొడుకు, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ ప్రాంతీయ ఆసుపత్రికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేరుకొని దుర్గా గౌడ్ బంధువులను పరామర్శించారు. ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.