Meenakshi Chaudhary | మీనాక్షి చౌద‌రి.. ఈ ముద్దుగుమ్మ ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ హ‌ర్యానా అందం త‌ర్వాత సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అడివి శేష్ ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటించ‌గా, ఈ సినిమా హిట్ కావ‌డంతో ముద్దుగుమ్మ‌కి ఆఫ‌ర్స్ వెల్లువెత్తుతున్నాయి. హిట్2 సినిమాలో మీనాక్షి ఆర్యా అనే పాత్రలో కనిపించి ఎంత‌గానో అల‌రించింది. ఇక మీనాక్షి వ‌రుణ్ తేజ్ హీరోగా రూపొంద‌నున్న […]

Meenakshi Chaudhary |

మీనాక్షి చౌద‌రి.. ఈ ముద్దుగుమ్మ ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట కొన్ని వెబ్ సిరీస్‌తో పాటు, సీరియల్స్‌లో నటించిన ఈ హ‌ర్యానా అందం త‌ర్వాత సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అడివి శేష్ ‘హిట్ 2’లోహీరోయిన్‌గా నటించ‌గా, ఈ సినిమా హిట్ కావ‌డంతో ముద్దుగుమ్మ‌కి ఆఫ‌ర్స్ వెల్లువెత్తుతున్నాయి.

హిట్2 సినిమాలో మీనాక్షి ఆర్యా అనే పాత్రలో కనిపించి ఎంత‌గానో అల‌రించింది. ఇక మీనాక్షి వ‌రుణ్ తేజ్ హీరోగా రూపొంద‌నున్న కొత్త చిత్రంలోను ఎంపికైంది. 'పలాస 1978' చిత్ర దర్శకుడు కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో VT14 తెరకెక్కబోతుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా ఈ హ‌ర్యానా బ్యూటీనే ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం.

ఇక మీనాక్షి సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న విష‌యం తెలిసిందే. మీనాక్షి అందాల‌కి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ కు సంబంధించిన ప్రెస్ మీట్ లో రెడ్ డ్రెస్ లో క‌నిపించి ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది.

ఎగ‌సిప‌డుతున్న ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది. ఆ అందాల‌ని చూడ‌డానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌డం లేదంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మీనాక్షి బ్యూటీఫుల్ పిక్స్ మాత్రం సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి. బ్యూటీ అందాల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

ఇక దుబాయి వేదికగా సైమా అవార్డ్స్‌ ఈ నెల 15, 16 తేదీల్లో వైభవంగా జర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో రానా, నిధి అగ‌ర్వాల్, మీనాక్షి చౌద‌రి పాల్గొన్నారు.

మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ “సైమా అవార్డ్స్‌లో పాల్గొనడం నాకిదే ప్రథమం అని పేర్కొంది. సైమా కేవలం ఓ వేడుక కాదు, సినిమా వాళ్లకు ఓ పండుగ అని తెలియ‌జేసింది. ఈ పండుగలో భాగం అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని మీనాక్షి చెప్పుకొచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో సైమా చైర్‌పర్సన్‌ బృందా ప్రసాద్‌, శశాంక్‌ శ్రీవాస్తవ్ కూడా పాల్గొన్నారు.

Updated On 4 Sep 2023 4:52 AM GMT
sn

sn

Next Story