Wednesday, December 7, 2022
More
    Homehealthకిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్.. అసలు విషయం ఏంటంటే?

    కిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్.. అసలు విషయం ఏంటంటే?

    విధాత: మీనా అనగానే.. అందరికీ ఓ అద్భుతమైన రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. ఇప్పటి కుర్ర కారుకి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చునేమో గానీ.. ఒకప్పుడు మాత్రం కుర్రకారుకి నిద్ర లేకుండా చేసిన పేరిది. అందాలన్నీ రాశిగా కలబోసిన అందం నటి మీనాది. అప్పటికీ, ఇప్పటికీ అదే గ్లామర్‌ని మెయింటైన్ చేస్తూ.. ఇప్పటికీ అప్పుడప్పుడు వెండితెరపై మీనా మెరుస్తోంది.

     

     

    సౌత్‌లోని ఒకప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన మీనా.. నటిగా 40 సంవత్సరాలను సక్సెస్ ఫుల్‌గా సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య మీనాపై లేని పోని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే మీనా భర్త ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణం ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం గానే చెప్పుకోబడుతుంది. ముఖ్యంగా ఆయన మరణానికి పావురాలు కారణంగా అప్పట్లో చెప్పబడ్డాయి.

     

     

    సరే, ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ముఖ్యంగా మీనా సీక్రెట్ మ్యారేజ్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు కిచ్చా సుదీప్‌ని మీనా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలీ వార్తలలో నిజమెంత? నిజంగానే మీనా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందా? చేసుకుంటే ఎప్పుడు చేసుకుంది? ఎందుకు ఇప్పుడామె మ్యారేజ్ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి? అనేది తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే.

     

     

     

    రీసెంట్‌గానే మీనా భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమె సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఇప్పుడు సీక్రెట్‌గా సుదీప్‌ని మీనా రెండో పెళ్లి చేసుకుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ సీక్రెట్ మ్యారేజ్ వ్యవహారం ఇప్పటిది కాదు. హీరోయిన్లు విషయంలో ఎఫైర్స్, ఈ మ్యారేజ్ గాసిప్స్ సహజం. మీనా హీరోయిన్‌గా మాంచి ఊపు మీదున్న సమయంలో.. ఆమెపై లేని పోని గాసిప్స్ విపరీతంగా వినిపిస్తూ ఉండేవి.

     

     

    ఇప్పటి హీరోయిన్ల విషయంలో కూడా అవి మాములే. కానీ మీనా అందానికి అప్పట్లో ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యేవారు. ఆమె చేసే సినిమాలలోని ప్రతి హీరోతో ఎఫైర్ ఉన్నట్లుగా అప్పట్లో రూమర్స్ వినిపించేవి. అలాగే సుదీప్‌తో కూడా ఆమెకు ఎఫైర్ ఉందని, సీక్రెట్‌గా వారు మ్యారేజ్ కూడా చేసుకున్నారనేలా.. వార్తలు గుప్పుమన్నాయి.

     

     

    వారిద్దరూ కలిసి 2003లో ఓ చిత్రం, 2006లో ఓ చిత్రం చేశారు. 2006లో చేసిన చిత్రం సమయంలో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకున్నారనేలా మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ వార్తలని ఇద్దరూ ఖండించారు. సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకోవాల్సినంత అవసరం నాకు లేదని, ఖచ్చితంగా అందరికీ చెప్పే చేసుకుంటానని మీనా కూడా మీడియా ముఖంగా తెలియజేసింది.

     

     

     

     

    సుదీప్ కూడా దాదాపు ఇలానే చెప్పి.. మా బంధం కేవలం స్నేహం మాత్రమే అని తెలియజేశాడు. అయినా వార్తలు ఆగలేదు. దీంతో మీనా కుటుంబ సభ్యులు కలగజేసుకుని, వెంటనే ఆమెకు పెళ్లి సంబంధాలు చూసి.. విద్యాసాగర్‌తో 2009లో మ్యారేజ్ చేసేశారు. ఆ తర్వాత ఆమెపై ఎటువంటి వార్తలు రాలేదు.

     

     

     

     

     

    మళ్లీ ఇప్పుడు తన భర్త చనిపోవడంతో.. ఎవరో కావాలని ఈ పాత వార్తని బయటికి తీసి వైరల్ చేస్తున్నారు. అంతే తప్ప.. మీనా ఎటువంటి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె నటిగా కొనసాగాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఆమెకి ప్రస్తుతం ఓ పాప (నైనిక) కూడా ఉంది.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular

    You cannot copy content of this page