Miss Shetty Mister Polishetty | విధాత‌: నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు తెరకెక్కించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ని నవీన్ పొలిశెట్టి ఒక్కడే దగ్గరుండి చేస్తున్నాడు. ఎక్కడపడితే అక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వాలిపోతున్నాడు. పాపం స్వీటీ మాత్రం హ్యాండిచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌కి […]

Miss Shetty Mister Polishetty | విధాత‌: నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్‌లో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు తెరకెక్కించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌ని నవీన్ పొలిశెట్టి ఒక్కడే దగ్గరుండి చేస్తున్నాడు. ఎక్కడపడితే అక్కడ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వాలిపోతున్నాడు. పాపం స్వీటీ మాత్రం హ్యాండిచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌కి అనుష్క కూడా వస్తుందని అంతా భావించారు కానీ.. ఎక్కడా కనిపించలేదు.

సోషల్ మీడియా వేదికగా మాత్రం కొన్ని ట్వీట్స్ చేస్తుంది అంతే. నవీన్ మాత్రం మ్యాగ్జిమమ్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవే తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. ట్విట్టర్ వేదికగా సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. సినిమా ఎలా ఉందో తెలియజేశారు. ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని మించిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

‘‘ ‘మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కథాంశం. ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్‌గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి‌లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్‌ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ Mahesh Babuని అభినందించాల్సిందే.

BTW ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్‌లో ప్రేక్షకులందరితోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్‌ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!!! యువీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్, Cast & Crew టీమ్ అందరికీ నా అభినందనలు, శుభాకాంక్షలు.. అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజున వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇందులో మెగాస్టార్ సరసన అరడజనుకు పైగా హీరోయిన్స్ ఉంటారని టాక్.

Updated On 5 Sep 2023 4:02 PM GMT
somu

somu

Next Story