MICROLINO | భల్లే భల్లే.. బుడగ కార్లు 60-70 ఏళ్ల నాటి మోడల్స్ విద్యుత్ వాహనాల అవతారం మార్కెట్లోకి మళ్లీ బబుల్ కార్స్ ఎంటర్ ది ‘న్యూ’ డ్రాగన్ విధాత: ఈ నెల 5-8 తేదీల్లో మ్యూనిచ్ (జర్మనీలో) నిర్వహించిన ఇంటర్నేషనేల్ ఆటోమొబిల్ ఆస్టెలుంగ్ అంతర్జాతీయ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్- IAA మొబిలిటీ)లో తళుక్కున మెరిసిన మైక్రో కార్లు. స్విస్ కంపెనీ తయారు చేసిన బుల్లి బ్యాటరీ కారు ‘మైక్రోలినో’, ఇటాలియన్-చైనీస్ సంస్థ ఎక్స్ఈవీ రూపుదిద్దిన యోయో’ చూపరులను […]

MICROLINO |
- భల్లే భల్లే.. బుడగ కార్లు
- 60-70 ఏళ్ల నాటి మోడల్స్
- విద్యుత్ వాహనాల అవతారం
- మార్కెట్లోకి మళ్లీ బబుల్ కార్స్
- ఎంటర్ ది ‘న్యూ’ డ్రాగన్
విధాత: ఈ నెల 5-8 తేదీల్లో మ్యూనిచ్ (జర్మనీలో) నిర్వహించిన ఇంటర్నేషనేల్ ఆటోమొబిల్ ఆస్టెలుంగ్ అంతర్జాతీయ ఆటోమొబైల్ ఎగ్జిబిషన్- IAA మొబిలిటీ)లో తళుక్కున మెరిసిన మైక్రో కార్లు. స్విస్ కంపెనీ తయారు చేసిన బుల్లి బ్యాటరీ కారు ‘మైక్రోలినో’, ఇటాలియన్-చైనీస్ సంస్థ ఎక్స్ఈవీ రూపుదిద్దిన యోయో’
చూపరులను ఆకట్టుకున్నాయి.
‘మైక్రోలినో’కు 4 గంటలు ఛార్జ్ చేస్తే గంటకు 90 కిలోమీటర్ల వేగంతో 230 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఐరోపాలో సాంకేతికంగా చెప్పాలంటే అది ‘కారు’ నిర్వచనంలోకి రాదు. 4 చక్రాల భారీ సైకిల్ అనాలి!
అది మోటార్ బైకుకు, కారుకు నడిమధ్య స్థాయి వాహనం.
‘మైక్రోలినో’లో చౌక మోడల్ ధర అక్షరాలా 16 లక్షలు! సాంకేతికంగా ఇది కారు కాదు కనుక ప్రధాన దేశాల్లో విద్యుత్ వాహనాల కోటాలో రాయితీలు రాకపోవచ్చు. యూరప్ ఖండపు నగరాల్లోని పాత, ఇరుకు రోడ్లకు బబుల్ కార్లు చక్కగా సూట్ అవుతాయట.
