Sunday, December 4, 2022
More
  Homelatestఓవైసీ వినూత్న ఆలోచన.. బిర్యానీ ఫెస్ట్ లతో ఓటర్లకు గాలం..

  ఓవైసీ వినూత్న ఆలోచన.. బిర్యానీ ఫెస్ట్ లతో ఓటర్లకు గాలం..

  ఎన్నికలు అనగానే రాజకీయ నాయకులకు ఓటర్లు గుర్తొస్తారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పాడరాని పాట్లు పడుతుంటారు. ఇక డబ్బు ఇష్టారీతిన పంచుతారు. మద్యానికి, తిండికి కొదవే ఉండదు. ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నమైన పద్ధతుల్లో ముందుకు వెళ్తారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటర్లకు గాలం వేసేందుకు వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. బిర్యానీ ఫెస్ట్ లు నిర్వహించి, ఓటర్లను ఆకర్షిస్తున్నారు.


  2023లో జరగబోయే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని మెజార్టీ స్థానాల్లో గెలిపించుకునేందుకు ఓవైసీ ఇప్పట్నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్కక్రమాన్ని ముమ్మరం చేసింది. యువతను ఆకర్షించేందుకు, పార్టీలో చేర్పించుకునేందుకు ఓవైసీ బిర్యానీ ఫెస్ట్ లు నిర్వహిస్తున్నారు.


  ఈ సందర్భంగా ఎంఐఎం లీడర్ పీర్జాదా తఖీర్ నిజామి మాట్లాడుతూ.. అతిథి దేవో భవ కార్యక్రమం కింద పార్టీ కేడర్ కు బిర్యానీ ఫెస్ట్ లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తాను పోటీ చేయబోయే నరేలా నియోజకవర్గంలో ఇప్పటికే 25 వేల మంది ఎంఐఎం సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. నరేలా నియోజకవర్గంలో 40 శాతం మంది ముస్లిం ఓటర్లే ఉన్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి మధ్యప్రదేశ్ లో 10 లక్షల మంది సభ్యత్వం తీసుకునేలా కార్యక్రమాలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, రుచికరమైన హైదరాబాద్ బిర్యానీని కార్యకర్తలకు అందిస్తున్నామని చెప్పారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page