Wednesday, March 29, 2023
More
    HomelatestVishakha summit l ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్! పెట్టుబడుల సభ హిట్... మంత్రి అమర్నాథ్...

    Vishakha summit l ఆపరేషన్ సక్సెస్.. పేషంట్ డెడ్! పెట్టుబడుల సభ హిట్… మంత్రి అమర్నాథ్ పదవి ఫట్!

    Minister Amarnath.. Vishakha summit

    విధాత‌: చూస్తుంటే ఇదే అయ్యేలా ఉంది.. విశాఖలో పెట్టుబడుల సదస్సు(global investment simtit) గ్రాండ్ సక్సెస్ అయింది.. దీనికి ముందు పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఇతర అధికారులు పలు నగరాల్లో పర్యటించి సన్నాహక సదస్సులు నిర్వహించారు..పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు విశాఖ వచ్చేలా చేసిన ప్రయత్నాల్లో ఆయన పాత్రా ఉంది.. కానీ ఆ క్రెడిట్ ఆయనకు దక్కలేదు.. మొత్తం జగన్ (YS Jagan) ఖాతాలో జమైంది.

    మొత్తానికి తొలిసారి ఎమ్మెల్యే అయిన అమర్నాథ్ ఏకంగా కీలకమైన పరిశ్రమల మంత్రిగా పదవి దక్కించుకున్నారు. కానీ, త్వరలో ఆయనకు ఉద్వాసన తప్పేలా లేదంటున్నారు. 2014లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అమర్ 2019లో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కేబినెట్ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. కానీ ఈసారి ఆయనకు అనకాపల్లిలో టికెట్ దక్కేలా లేదు. అది వాస్తవానికి గవర కమ్యూనిటీకి ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కావడంతో ఈసారి తమకే సీట్ ఇవ్వాలని అక్కడి నాయకులు కోరుతున్నారు.

    దీంతో కాపు వర్గానికి చెందిన అమర్ కు ఈసారి సీట్ దక్కేది అనుమానమే అంటున్నారు. దీంతోబాటు త్వరలో జరిగే మంత్రివర్గ మార్పుల్లో ఆయనకు ఈ మంత్రి పదవి కూడా ఉండదని.. ఆయన పెర్ఫార్మెన్స్ సరిగలేదని జగన్ భావిస్తున్న తరుణంలో ఆయనకు పదవీ గండం ఉందని అంటున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో ఆయనకు ఇచ్చేందుకు వేరేచోట సీట్ లేకపోవడంతో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇప్పుడు ఎంపీలుగా ఉన్న విశాఖ ఎంపీ సత్యనారాయణ.. అనకాపల్లి ఎంపీ సత్యవతి వీళ్లిద్దరూ ఎమ్మెల్యేలుగా వెళ్తారని..జగన్ ఆ ప్లాన్‌లోనే ఉన్నారని అంటున్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular