Rajahmundry Central Jail | రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను కావాలనే బదిలీ చేశారు. కొత్తగా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ బంధువు రవి కిరణ్‌ను తీసుకొచ్చారు. ఆయన రాత్రిపూట కూడా బాబు సెల్ వద్ద తిరుగుతూ అన్నీ వాకబు చేస్తున్నారు. అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు మీద ఏపీ ప్రభుత్వంతో బాటు కొత్త సూపరింటెండెంట్ రవి కిరణ్ సైతం స్పందించారు. ముందున్న జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మరణించడంతో ఆయన కొన్నాళ్ళు సెలవు […]

Rajahmundry Central Jail |

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్‌ను కావాలనే బదిలీ చేశారు. కొత్తగా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ బంధువు రవి కిరణ్‌ను తీసుకొచ్చారు. ఆయన రాత్రిపూట కూడా బాబు సెల్ వద్ద తిరుగుతూ అన్నీ వాకబు చేస్తున్నారు. అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలు మీద ఏపీ ప్రభుత్వంతో బాటు కొత్త సూపరింటెండెంట్ రవి కిరణ్ సైతం స్పందించారు.

ముందున్న జైల్ సూపరింటెండెంట్ రాహుల్ భార్య కిరణ్మయి మరణించడంతో ఆయన కొన్నాళ్ళు సెలవు మీద వెళ్లారని, అందుకే జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ను నియమించామని ప్రభుత్వం చెబుతోంది. ఇక రవి కిరణ్ సైతం దీని మీద స్పందించారు.

తాను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డికి సమీప బంధువునని.. అంతమాత్రాన తాను ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిని అని ఎలా విమర్శిస్తారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ నాయకులతో బంధుత్వం ఉన్నంత మాత్రాన నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తానన్న ఆలోచన సరి కాదన్నారు.

చంద్రబాబు భద్రతపై లోకేశ్ అనుమానాలు వ్యక్తం చేయటంతోనే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ఇన్ ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతల్ని తనకు తాత్కాలికంగా అప్పగించారని ఈ విషయంలో తనకు జైళ్ల శాఖకు ఎలాంటి దురుద్దేశాలు అంటగట్టొద్దని పేర్కొన్నారు.

చంద్రబాబుతో ములాఖత్ కోసం ఆయన సతీమణి భువనేశ్వరి చేసుకున్న అప్లికేషన్‌ను రూల్ ప్రకారమే తిరస్కరించామన్నారు. చంద్రబాబు భద్రత మీద అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే 12 రాత్రి జైల్లో రాత్రి వేళలో తాను స్వయంగా గస్తీ తిరిగానని అన్నారు.

Updated On 18 Sep 2023 3:59 AM GMT
krs

krs

Next Story