Warangal | సీఐటీయూ నాయకుల అరెస్టు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆశా వర్కర్లకు కనీస వేతనంగా రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) ఆందోళనకు దిగింది. మంగళవారం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల్లు ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్యన తోపులాట జరిగింది. నాయకులు, ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఆశా వర్కర్లను […]

Warangal |
- సీఐటీయూ నాయకుల అరెస్టు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఆశా వర్కర్లకు కనీస వేతనంగా రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) ఆందోళనకు దిగింది. మంగళవారం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇల్లు ముట్టడించారు.
ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్యన తోపులాట జరిగింది. నాయకులు, ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని నినాదాలు చేశారు. మంత్రి ఎర్రబెల్లి ఇళ్లు ముట్టడికి ముందు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా మంత్రి ఇంటి వరకు భారీ ర్యాలీని నిర్వహించారు.
ఆశాలను మోసం చేసిన ప్రభుత్వం
గడిచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశాలకు కనీస వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి కాలయాపన చేసిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు బొట్ల చక్రపాణి విమర్శించారు. పారితోషికాలు కాకుండా కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 18 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నా ప్రభుత్వం వారిని గుర్తించడంలేదన్నారు.
రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్లైన్ పని చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర అన్ని రకాల జబ్బులను గుర్తించి ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులను ప్రజలకు అందజేసే ముఖ్యమైన పాత్ర పోషించే వారిపట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని దుయ్యబట్టారు.
కార్యక్రమంలో సీ ఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి, నాయకులు ఎన్. రజిత, కన్నురి కల్పన, కే. పద్మ, గొర్రె పుతిలి, ఎం. జ్యోతి, ఎల్. సంధ్య, సిహెచ్. రాజేశ్వరి, సిహెచ్. శ్రీవాణి. ఎస్. రమ, యాకూబీ, బొక్క సునంద, రజినీ, ఎస్ పద్మ, మాచర్ల రజిత, సుమలత, ఆశాలు పాల్గొన్నారు.
