Saturday, April 1, 2023
More
    HomelatestMinister Jagadish reddy | మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట మంత్రి జగదీష్ రెడ్డి

    Minister Jagadish reddy | మోడీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట మంత్రి జగదీష్ రెడ్డి

    విధాత: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు ఈడీ నోటీసులు ఇవ్వడం బీజేపీ(BJP) దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Guntakandla Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి బీజేపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

    రాజకీయ దురుద్దేశం తోనే కవితపై ఆరోపణలు చేసిన ఎంపీ వ్యాఖ్యల ఆసరాగా కేసులు అల్లడం సిగ్గు చేటని మంత్రి అన్నారు. మోడీ(MODI) దురాగతాలను బయట పెడుతున్న కేసీఆర్‌పై మోడీ పన్నిన కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని మండిపడ్డారు.

    చరిత్రలో ఏనాడూ లేని విధంగా రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ, రాజ్యాంగ సంస్థలను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని చూడటం బీజేపీకి తగదని మంత్రి అన్నారు.

    మోడీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడినాయన్న మంత్రి, ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త ఏమి కాదని అన్నారు. నియంతలు నిలబడినట్లు చరిత్రలో ఏనాడూ లేదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామ‌నిమంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular