విధాత: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం ఆంజనేయ స్వామికి మంత్రి జి. జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) దంపతులు హనుమజ్జయంతి సందర్భంగా 108 వెండి తమలపాకుల తోరణాలు బహుకరించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి, సతీమణి సునీతా జగదీష్ రెడ్డి, తనయుడు వేమన్ రెడ్డిలతో కలిసి ప్రత్యేక పూజల నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంజనేయ స్వామి అమితంగా ఇష్టపడే ఆకుపూజల నిమిత్తం వెండితో 108 తమలపాకుల ఆకృతి తో ప్రత్యేకంగా తయారు చేయించిన తోరణాల మాలను మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు ఆంజనేయ స్వామికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.