ఆపత్కాలంలో.. అక్కున చేర్చుకుని.. ఇంజనీరింగ్ కల సాకారం చేసిన మంత్రి Minister Jagadish Reddy | విధాత, సూర్యాపేట: సమయం రాత్రి పది గంటలు.. మరో రెండు గంటలు మాత్రమే గడువు. డబ్బులు తీసుకొస్తామని వెళ్ళిన తల్లిదండ్రులు అటే వెళ్లారు. సమయం గడుస్తున్న కొద్దీ.. తాను బీటెక్ చదవాలనుకున్న కోరిక నేరెవెరేలా లేదు. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో మేనమామలా తనలాంటి ఎంతోమందిని అక్కున చేర్చుకున్న సూర్యాపేట శాసన సభ్యులు జగదీశ్ మామ […]

  • ఆపత్కాలంలో.. అక్కున చేర్చుకుని..
  • ఇంజనీరింగ్ కల సాకారం చేసిన మంత్రి

Minister Jagadish Reddy |

విధాత, సూర్యాపేట: సమయం రాత్రి పది గంటలు.. మరో రెండు గంటలు మాత్రమే గడువు. డబ్బులు తీసుకొస్తామని వెళ్ళిన తల్లిదండ్రులు అటే వెళ్లారు. సమయం గడుస్తున్న కొద్దీ.. తాను బీటెక్ చదవాలనుకున్న కోరిక నేరెవెరేలా లేదు. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి.

సరిగ్గా అదే సమయంలో మేనమామలా తనలాంటి ఎంతోమందిని అక్కున చేర్చుకున్న సూర్యాపేట శాసన సభ్యులు జగదీశ్ మామ గుర్తుకు వచ్చి, తన బంధువు సహాయంతో క్యాంపు కార్యాలయానికి చేరుకుంది నామవరానికి చెందిన ప్రవీణ. విద్యార్థిని ముఖంలో ఆందోళనను గమనించిన మంత్రి, విద్యార్థిని వాకబు చేశారు.

బీటెక్ చదవడానికి ఆన్ లైన్ ఫీజు చెలించే గడువు మరో రెండు గంటలు మాత్రమే ఉందని తెలుసుకున్నారు. హుటాహుటిన అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం చెల్లించాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విద్యార్థిని తన భవిష్యత్ పై పెట్టుకున్న ఆశలను సజీవంగా ఉంచారు.పేదరికంలో ఇంజనీరింగ్ విద్యను చదువుకోలేకపోతున్నామని ఆందోళనలో ఉన్న బాలిక కు అండగా నిలిచారు. వారికి ఆర్థిక సహాయం అందించి ఇంజనీరింగ్ చదవాలనుకున్న అమె కలను సాకారం చేశారు.

ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేక..

సూర్యాపేట జిల్లా మోతే మండలం నామవరం గ్రామానికి చెందిన ప్రవీణ ఇంటర్మీడియెట్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో, సూర్యాపేట లోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించింది. అఖిల తండ్రి సైదాచారి, తల్లి విజయ పేద కుటుంబం కావడంతో ఫీజులు ఎలా చెల్లించాలో వారికి అర్థం కాలేదు. అప్పు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

కాగా.. తనను కలిసిన బాలిక పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి చేయూత అందించారు. ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. అన్నివిధాలా అండగా ఉంటానని, బాగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని సూచించారు. మంత్రి చేయూతతో తన ఇంజనీరింగ్ ఆశ కల నెరవేరిందని ప్రవీణ, ఆమె బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సమాజానికి తమవంతు సేవ చేస్తామని అన్నారు.

Updated On 29 Aug 2023 1:47 PM GMT
somu

somu

Next Story