విధాత: విద్య విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతుంద‌ని, క్రీడలు గెలుపోట‌ముల‌ను స‌మానంగా స్వీక‌రించాల‌నే స్ఫూర్తిని నింపుతాయ‌ని అవి విద్యార్థుల‌కు జీవితంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జి.జే.ఆర్ కప్ క్రీడా పోటీలను ఆయన తిలకించి మాట్లాడారు. విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీ ఆర్ ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధిలో […]

విధాత: విద్య విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతుంద‌ని, క్రీడలు గెలుపోట‌ముల‌ను స‌మానంగా స్వీక‌రించాల‌నే స్ఫూర్తిని నింపుతాయ‌ని అవి విద్యార్థుల‌కు జీవితంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జి.జే.ఆర్ కప్ క్రీడా పోటీలను ఆయన తిలకించి మాట్లాడారు.

విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే బీ ఆర్ ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధిలో క్రీడలు ముఖ్య భాగమని తెలిపారు. క్రీడల ద్వారా ఓటమి నుండి తిరిగి గెలుపొందాలనే స్ఫూర్తిని పొందుతారు. ఆ స్ఫూర్తితో విద్యార్ధులు త‌మ‌ జీవితంలో కష్టాలు వచ్చినపుడు వాటికి ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తార‌ని తెలిపారు.

కార్పొరేట్ విద్యా వ్యవస్థలో క్రీడలకు సరైన ప్రాధాన్యత లేక పోవడం వల్లే విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి కొరవడి ప్రతీ చిన్న విషయానికి తట్టుకోలేకే జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాతికి అమూల్య సంపద అయిన చిన్నారుల ఆరోగ్యం విషయంలో దృష్టి పెట్టవలసిన అవసరం ప్రతీ ఒక్కరి పైన ఉందని అన్నారు.

క్రీడలు పిల్లల శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ మేరకు పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచన మారాలని సూచించారు. క్రీడలలో రాణించండం ద్వారా విద్య‌లో సైతం పిల్లలు మంచి ప్రతిభను కనబరుస్తారని మంత్రి అన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్ గేమ్ లకు పరిమితమై క్రీడలకు దూరమవుతున్న పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

కార్పొరేట్ విద్యా సంస్థలలో విద్యార్డుల ఆత్మహత్యలకు కారణం క్రీడలు లేక పోవడమే ముఖ్య కార‌ణ‌మ‌ని అన్నారు. దేశంలో క్రీడా విద్య‌కు త‌గిన‌ బడ్జెట్ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశాన్నీ పాలిస్తున్న పాలకుల వైఫల్యం వల్లే, అత్య‌ధిక‌ జనాభా కలిగిన మన దేశం ఒలంపిక్స్ వంటి క్రీడా ఈవెంట్ల‌లొ అట్టడుగున ఉండటానికి కారణం అన్నారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిపబ్లిక్ డే రోజున బహుమతులు అందజేస్తామని మంత్రి తెలిపారు.

యువత కోసం త్వరలో క్రీడల పోటీలు…

రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్దులకు నిర్వహించిన క్రీడల మాదిరిగానే త్వరలో యువత కోసం కూడా క్రీడలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. క్రీడలను గ్రామాల వారీగా, మున్సిపాలిటీ లో వార్డ్ ల వారీగా నిర్వహించి అక్కడ గెలుపొందిన వారికి నియోజకవర్గస్థాయిలో పోటీలను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

Updated On 25 Jan 2023 12:18 PM GMT
krs

krs

Next Story