విధాత: తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారు కాబ‌ట్టే తెలంగాణ వ‌చ్చింద‌న్నారు. ఉద్య‌మంలో మీరంతా లేక‌పోతే తెలంగాణ వ‌చ్చుడే లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌కు అన్ని గుండు సున్నాలు ఇచ్చి.. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కేమో.. లెక్క‌లేనన్ని విద్యా సంస్థ‌ల‌ను కేటాయించారు. ఎంత చిల్ల‌ర అంటే న‌వ్వాలో, ఏడ్వాల్నో కూడా […]

విధాత: తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన యూనివ‌ర్సిటీ విద్యార్థుల‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. విద్యార్థులు వీరోచిత పోరాటం చేశారు కాబ‌ట్టే తెలంగాణ వ‌చ్చింద‌న్నారు. ఉద్య‌మంలో మీరంతా లేక‌పోతే తెలంగాణ వ‌చ్చుడే లేద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ‌కు అన్ని గుండు సున్నాలు ఇచ్చి.. బీజేపీ పాలిత రాష్ట్రాల‌కేమో.. లెక్క‌లేనన్ని విద్యా సంస్థ‌ల‌ను కేటాయించారు. ఎంత చిల్ల‌ర అంటే న‌వ్వాలో, ఏడ్వాల్నో కూడా తెల్వ‌దు. నిజంగా కొట్లాడుదామంటే ఇది వ‌ర‌కు మ‌న‌కు మంచిగా ఉండే. మ‌న‌కు ప్ర‌త్య‌ర్థులు మంచిగా ఉండే.

చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉండే. వారితో కొట్లాడిన గ‌మ్మ‌త్తు ఉండే. వాళ్లు కూడా ఒక స్థాయి లీడ‌ర్లు కాబ‌ట్టి. వారితో ఓ మాట అన్న‌, ఓ మాట ప‌డ్డ ఒక ప‌ద్ధ‌తి ఉండే. ఇప్పుడు ఉన్న వారితో అయితే ఆగం ఉంది. ఎలాంటి బ‌ఫూన్ గాళ్ల‌ను మ‌న‌కు త‌గిలించారంటే కొట్లాట చేత కాదు. మాట్లాడ‌టం చేత కాదు. తెలంగాణ‌కు ఒక్క రూపాయి తెచ్చే తెలివి లేదు. సొంత పార్ల‌మెంట్‌లో అర పైసా ప‌ని కూడా చేయ‌లేదు.

ఎంత చిల్ల‌ర రాజ‌కీయం అంటే.. కేసీఆర్ క్షుద్ర పూజ‌లు చేస్తున్నడంట‌. న‌ల్ల పిల్లిని ముందు పెట్టుకొని పూజ చేస్తున్నాడ‌ట‌. తెలంగాణ రాక ముందు మీరంతా ఉస్మానియా, పాల‌మూరు, కాక‌తీయ మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీల్లో వీరోచితంగా పోరాటం చేసిన స‌మ‌యంలో ఈ బ‌ఫూన్ ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు.

కేసీఆర్ లేక‌పోతే టీఆర్ఎస్ లేదు. టీఆర్ఎస్ లేక‌పోతే ఈ ద‌ఫా తెలంగాణ ఉద్య‌మం లేదు. ఉద్య‌మంలో మీరంతా లేక‌పోతే తెలంగాణ వ‌చ్చుడే లేదు. ఈ తెలంగాణ రాక‌పోతే టీ బీజేపీ, టీ కాంగ్రెస్ ఉండేవి కావు, మీరు పెట్టిన భిక్ష‌నే ఆ ప‌ద‌వులు అని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated On 11 Oct 2022 1:54 PM GMT
subbareddy

subbareddy

Next Story