Jr NTR |
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఎన్టీఆర్ నివాసానికి పువ్వాడ అజయ్ మంగళవారం సాయంత్రం వెళ్లి.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు.
ఖమ్మం లాకారం ట్యాంక్ బండ్‌పై నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మే 28వ తేదీన ఎన్టీఆర్ విగ్రహాన్ని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మంత్రి పువ్వాడ అజయ్ జూ. ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి.. విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు.
శ్రీ కృష్ణుడి అవతారంలో 54 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహా ఏర్పాటుకు రూ. 2 కోట్ల మేర ఖర్చు కాగా, మంత్రి పువ్వాడ అజయ్ చొరవతో తానా సభ్యులతో పాటు మరికొంత మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు, ఎన్టీఆర్ అభిమానులు ముందుకు వచ్చి సాయం అందించారు.