Minister Roja పవన్‌ పళ్లు రాలగొడుతాం.. తుస్సుమన్న బ్రాహ్మిణి అస్త్రం విధాత: సీఎం జగన్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొడతామని మంత్రి రోజా హెచ్చరించారు. జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలపై ఆమె ఘాటుగా ప్రతిస్పందించారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరిందని, పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తామన్నారు. దొంగని జైలుకు కాక.. జైలర్ సినిమాకు పంపాలా? : Minister Roja -TV9#MinisterRoja #Roja […]

Minister Roja

  • పవన్‌ పళ్లు రాలగొడుతాం..
  • తుస్సుమన్న బ్రాహ్మిణి అస్త్రం

విధాత: సీఎం జగన్‌ను నోటికొచ్చినట్టు మాట్లాడితే పవన్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొడతామని మంత్రి రోజా హెచ్చరించారు. జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలపై ఆమె ఘాటుగా ప్రతిస్పందించారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరిందని, పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తామన్నారు.

సీమన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ అని, ఆ దొంగ చెప్పే మాటలు ఎవరు పట్టించుకుంటారని అన్నారు. సుమన్ బోస్ మాజీ ఎండి ఎందుకయ్యారని ప్రశ్నించారు. జగన్‌ రాజకీయాల్లోకి వచ్చి 13ఏళ్లు అయ్యిందని, రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఒకసారి ప్రతిపక్ష నేతగా, మరోసారి 151మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి అయ్యారన్నారు.

అసలు పవన్‌ కల్యాణ్‌ వార్డు మెంబర్‌గా కూడా గెలువలేదని, అలాంటి వ్యక్తి సీఎం జగన్‌పై అడ్డగోలుగా నోరు పారేసుకుంటే సహించలేది లేదన్నారు. నీ తల్లిని తిట్టిన వాడితో ప్యాకేజీ కోసం బానిస బ్రతుకు బ్రతుకుతు న్నావ్, నువ్వెంత నీ బ్రతుకెంత నీ స్థాయి ఎంత అంటూ పవన్‌పై మండిపడ్డారు.

టీడీపీ బ్రహ్మస్త్రం అనుకుని బ్రాహ్మణిని రంగంలోకి దింపారని, తీరా ఈ అస్త్రం కూడా తుస్సుమందన్నారు. దొరికిన దొంగను జైలుకు పంపించకుండా జైలర్‌ సినిమాకు పంపిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. పొరపాటున కూడా దేవాన్షుకు సీఐడీ రిమాండ్‌ రిపోర్టు చూపించవద్దని, చూస్తే మా తాత ఇంతపెద్ద అవినీతి పరుడా అనుకుంటాడన్నారు. తన మామా ఎంత వెన్నుపోటుదారుడో బ్రాహ్మణికి తెలియదా అని ప్రశ్నించిన రోజా మీ తాత ఎన్‌టీఆర్‌ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియో చూసి అర్ధం చేసుకోవాలన్నారు.

సాక్ష్యాదారాలు లేకుండా అరెస్టు చేశారంటూ బ్రాహ్మణి అంటుందని, సీఐడీ ఆఫీసుకు వెళ్లి అడిగితే వాళ్లే చూపిస్తారన్నారని, బ్రాహ్మణికి చదువు చెప్పినోళ్లు తల గోడకేసి కొట్టుకుంటారని, అసలు చంద్రబాబును ఏపీ సీఎం అనుకుంటుందా లేక దేశానికి పీఎం అనుకుటుంందా అని దుయ్యబట్టారు.

Updated On 17 Sep 2023 11:37 AM GMT
somu

somu

Next Story