Wednesday, December 7, 2022
More
  Homelatestనకలు చిటీలు ఇస్తే.. లవ్ లెటర్ అనుకొని యువకున్ని ముక్కలుగా నరికేశారు..

  నకలు చిటీలు ఇస్తే.. లవ్ లెటర్ అనుకొని యువకున్ని ముక్కలుగా నరికేశారు..

  Love Letter | విధాత: క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యానువల్ పరీక్షలు అనగానే భయపడిపోతుంటాం. పరీక్షలకు కొద్ది రోజుల ముందు నుంచే ప్రిపేర్ అవుతుంటాం. మంచి మార్కులు తెచ్చుకోవాలనే లక్ష్యంతో బాగా చదువుతాం. కానీ కొన్ని సందర్భాల్లో మన చదవిన ప్రశ్నలు ఎగ్జామ్‌లో రావు. అలాంటప్పుడు ఆందోళనకు గురవుతాం. అవసరమైతే చిటీల మీద కూడా ఆధారపడుతాం.

  అలా ఓ అమ్మాయి చిటీల మీద ఆధార పడింది. బయట నుంచి తన సోదరుడు చిటీ వేయగా, అది వేరే అమ్మాయి మీద పడింది. అది లవ్ లెటర్ అని అనుకుంది ఆ అమ్మాయి. ఇంటికి వచ్చిన తనకు ఆ అబ్బాయి లవ్ లెటర్ విసిరాడని చెప్పడంతో.. అతన్ని దొరికించుకుని ముక్కలు ముక్కలుగా నరికేశారు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్‌లో గత వారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

  బీహార్‌లో స్కూల్ విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఓ అమ్మాయి ఆరో తరగతి పరీక్షలు రాస్తోంది. అయితే తన సోదరికి చిటీలు వేసేందుకు ఓ అబ్బాయి ఎగ్జామ్ సెంటర్ వద్దకు వెళ్లాడు. ఇక కిటికీలో నుంచి చిటీలు విసిరేశాడు. కానీ ఆ చిటీలు సోదరి వద్ద పడలేదు. మరో అమ్మాయి వద్ద చిటీలు పడ్డాయి. అయితే ఆమె ఆ చిటీలను ప్రేమ లేఖగా భావించింది. కావాలనే తనకు లవ్ లెటర్ రాసి విసిరాడని భావించింది. ఇంటికి వచ్చి తన సోదరులకు చెప్పింది.


  ఇక నా చెల్లికే లవ్ లెటర్ రాస్తావా అని చెప్పి ఆమె సోదరులు ఆగ్రహాంతో ఊగిపోయారు. ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. చేతులను, కాళ్లను వేరు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. చేతులను స్థానిక ఆలయం వద్ద పడేయగా, కాళ్లను రైల్వే ట్రాక్ వద్ద పడేశారు.

  అయితే టెంపుల్ వద్ద ఉన్న చేతి స్థానికుల కంట పడింది. తక్షణమే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శరీర భాగాలను, దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్‌ బాడీ తమ బిడ్డదే అని బాధిత కుటుంబం నిర్ధారించింది.

  మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడిని హత్య చేసిన వారంతా మైనర్లు అని పోలీసులు తెలిపారు. వీరిని జువైనల్ హోమ్‌కు తరలించి నట్లు పేర్కొన్నారు. అయితే హత్యకు గురైన బాలుడు తెలివమంతుడని, చదువుల్లో ముందుండే వాడని తల్లిదండ్రులు తెలిపారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page