Udhayanidhi Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమైనదని అన్నారు. అంతటితో ఆగకుండా అది డెంగ్యూ, మలేరియా వ్యాధుల వంటిదని.. దానిని సమూలంగా నాశనం చేయాలని వ్యాఖ్యానించారు. దీనిపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధిపై కేసు నమోదు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 'రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అని […]

Udhayanidhi Stalin |
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమైనదని అన్నారు. అంతటితో ఆగకుండా అది డెంగ్యూ, మలేరియా వ్యాధుల వంటిదని.. దానిని సమూలంగా నాశనం చేయాలని వ్యాఖ్యానించారు.
దీనిపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధిపై కేసు నమోదు చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 'రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అని సందేశాలు దంచికొడతారు. కానీ వారి ఐఎన్‌డీఐఏలో భాగస్వామి అయిన డీఎంకే నాయకుడు అన్న మాటలపై ఆయన మౌనం పాటిస్తున్నారు.
వీరికి అధికారం ఇస్తే లక్షల సంవత్సరాలుగా ఉన్న భారతీయ నాగరికతను తుడిచిపెట్టేస్తారు' అని భాజపా నాయకుడు అమిత్‌మాలవీయ ఎక్స్‌లో ఆక్షేపించారు. అయితే ఈ పోస్టుపై ఉదయనిధి స్పందించారు. తాను హిందువులను ఊచకోత కోయాలని పిలుపునివ్వలేదని వివరణ ఇచ్చారు.
అయితే తన మాటలకు కట్టుబడి ఉంటానని.. కొవిడ్ 19, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల వలే సనాతన ధర్మం కూడా వ్యాధి అని.. దానిని నిర్మూలించాలని మరోసారి ట్వీట్‌లో ప్రస్తావించారు.
