MLA Chirumurthy’s comments were controversial
- బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నోరుజారిన చిరుమర్తి
విధాత: బండి సంజయ్(Bandi Sanjay) ఎమ్మెల్సీ కవితMLC Kavitha) పై చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumarti Lingayya) చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. బండి సంజయ్ వాఖ్యలను నిరసిస్తూ నకరేకల్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ
బండి సంజయ్ భార్య కావచ్చు.. బిజెపి నాయకుల భార్యలు కావచ్చు.. మా తెలంగాణ తమ్ముళ్లు, మా బిఆర్ఎస్ నాయకులు మీ పెళ్లాలకు ముద్దులు పెడతారు.. ఊరుకుంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని, మహిళా సమాజాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా, అప్రజాస్వామికంగా బండి సంజయ్ మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బండి సంజయ్ రోడ్ల మీదకు వస్తే చెప్పుతో కొడతాం.. దొంగ నా కొడుకు అంటూ పరుష పదజాలంతో లింగయ్య విమర్శించారు. చిరుమర్తి లింగయ్య చేసిన ఆ వివాదాస్పద వ్యాఖ్యల పట్ల బిజెపి శ్రేణులు భగ్గుమంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యల పట్ల బిజెపి శ్రేణులు నిరసనలకు పిలుపునిచ్చాయి.
ఒక రకంగా బండి సంజయ్ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలకు కౌంటర్ అన్నట్లుగా చిరుమర్తి వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని బిజెపి శ్రేణులు నిరసనలకు, ఆందోళనలకు దిగడం గమనార్హం. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు ఫోన్ చేసి మరి నిలదీయాలంటూ బిజెపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.