Sunday, December 4, 2022
More
  Homelatestగెట‌ప్ మార్చిన ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. మీరు గుర్తు ప‌ట్ట‌లేరేమో..?

  గెట‌ప్ మార్చిన ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. మీరు గుర్తు ప‌ట్ట‌లేరేమో..?

  విధాత: కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.. ఈయ‌న పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ఎందుకంటే.. సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సొంత పార్టీ నేత‌ల‌తో పాటు ఇత‌ర పార్టీల నాయ‌కుల మీద విమ‌ర్శలు గుప్పిస్తు వార్త‌ల్లో నిలుస్తుంటారు. అంతేకాదు ఆయ‌న‌కు ఓ ప్ర‌త్యేక‌త కూడా ఉంది. ఆ జ‌గ్గారెడ్డి అంటే.. పొడ‌వాటి జ‌ట్టు, బూర మీసాలు, భారీ గ‌డ్డం వేసుకుని ఉంటారు. ఆయ‌నే జ‌గ్గారెడ్డి అని అంద‌రూ గుర్తు చేసుకుంటారు.

  ఆయ‌నను గుర్తు ప‌ట్ట‌డానికి ఈ మూడు కూడా ఒక సూచిక అని చెప్పొచ్చు. ఆయ‌న స్టైల్‌ను కూడా ఇష్ట‌ప‌డే వారెంద‌రో ఉన్నారు. జ‌గ్గారెడ్డి అలానే ఉంటేనే బాగుంటుంద‌ని కోరుకునే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. బూర మీసాలు, భారీ గ‌డ్డంతోనే జ‌గ్గారెడ్డిని ఆయ‌న అభిమానులు ఇష్ట‌ప‌డుతారు. కానీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఇప్పుడు త‌న గెట‌ప్‌ను పూర్తిగా మార్చేశారు.

  ఎనిమిదేండ్ల త‌ర్వాత త‌న పొడ‌వాటి జుట్టు, బూర మీసాలు, భారీ గ‌డ్డంను తీసేశారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల‌కు వెళ్లిన ఆయ‌న గుండు చేయించుకున్నారు. ప‌సుపు రంగులో ఉన్న టీ ష‌ర్ట్, తెలుపు రంగులో ఉన్న పంచెను ధ‌రించి జ‌గ్గారెడ్డి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫోటోలో ఉన్న వ్య‌క్తి ఎవ‌రో తెలుసా? మీరు గుర్తు ప‌ట్టారా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించుకుంటున్నారు.

  ఎమ్మెల్యేగా, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నప్పటికి జ‌గ్గారెడ్డి పాత గెటప్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. గడ్డం, హెయిర్ స్టైల్ మార్చుకోమని సలహా ఇచ్చినా మార్చుకోని జ‌గ్గారెడ్డి దేవుని మొక్కు తీర్చే విషయంలో రాజీ పడ్డారని అనుచరులు చెప్పుకుంటున్నారు.

  అయితే ఆయ‌న గెట‌ప్ మార‌డంతో పాటు రాజ‌కీయ వ్యూహాలు మారుతాయ‌ని అనుచ‌రులు పేర్కొంటు న్నారు. నేను ఇప్పుడు మారాను. రాజ‌కీయంగా, వ్య‌క్తిగ‌తంగా నాలో మార్పు చూస్తార‌ని త‌న అనుచ‌రుల‌కు ఫోన్ ద్వారా జ‌గ్గారెడ్డి చెప్పిన‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page