MLA Kishore విధాత: తుంగతుర్తి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో జరుగుతున్న చౌడమ్మ తల్లి పండుగకి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి యాదవ సాంప్రదాయ భేరీలు మ్రోగించారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కత్తి (కరవాలం)ని తిప్పుతూ చేసిన విన్యాసం అక్కడున్న గ్రామస్తులను, భక్తులను అబ్బురపరిచింది. గతంలో కత్తి సాములో ప్రవేశమున్నట్లుగా చాలా లాఘవంగా ఎమ్మెల్యే కిషోర్ కత్తి […]

MLA Kishore

విధాత: తుంగతుర్తి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ నూతనకల్ మండలం తాళ్లసింగారం గ్రామంలో జరుగుతున్న చౌడమ్మ తల్లి పండుగకి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి యాదవ సాంప్రదాయ భేరీలు మ్రోగించారు.

అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కత్తి (కరవాలం)ని తిప్పుతూ చేసిన విన్యాసం అక్కడున్న గ్రామస్తులను, భక్తులను అబ్బురపరిచింది. గతంలో కత్తి సాములో ప్రవేశమున్నట్లుగా చాలా లాఘవంగా ఎమ్మెల్యే కిషోర్ కత్తి సాము చేయడం అందరిని ఆకట్టుకుంది.

అటు నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండల కేంద్రంలో జరిగిన శ్రీ చౌడమ్మ లింగమతుల జాతరలో ఎంపీ బడుగుల లింగ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పాల్గొని పూజలు నిర్వహించారు. డోలు వాయించి భక్తులను ఉత్సాహపరిచారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జనంతో మమేకం కావాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ నాయకులు వేసవిలో గ్రామాల్లో విరివిగా జరుగుతున్న గ్రామ దేవతల పండుగలు, అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

Updated On 8 May 2023 3:46 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story