రూ.50వేల చొప్పున త‌క్ష‌ణ సాయం అంద‌జేత‌ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనలో మృతి చెందిన ముగ్గురికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం రాత్రి నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి నర్సంపేటలోని వారి స్వస్థలాలకు చేరిన భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఓదార్చారు. తాను ముందుగా ప్రకటించిన మేరకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. మృతులు […]

  • రూ.50వేల చొప్పున త‌క్ష‌ణ సాయం అంద‌జేత‌

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదం సంఘటనలో మృతి చెందిన ముగ్గురికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం రాత్రి నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి నర్సంపేటలోని వారి స్వస్థలాలకు చేరిన భౌతికకాయాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఓదార్చారు. తాను ముందుగా ప్రకటించిన మేరకు ఒక్కో కుటుంబానికి రూ.50 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు.

మృతులు ముగ్గురూ నర్సంపేటకు చెందినవారే

వృత్తులలో ముగ్గురు నర్సంపేటకు చెందిన వారు. దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల, ఖానాపూర్ మండలానికి చెందిన బానోతు శ్రావణి, నర్సంపేట మండలం చంద్రాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివలు ఉన్నారు. వారి స్వగ్రామాల్లోకి వెళ్లి పరామర్శించారు.

ఇదిలా ఉండగా అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడి మృతులకు పోస్ట్ మార్టం జరిపించాలని కోరారు. పోస్ట్ మార్టం అనంతరం మృతుల భౌతిక కాయలను వారి స్వగ్రామానికి చేర్చడానికి అన్ని రకాల సహాయక చర్యలను చేపట్టారు.

Updated On 17 March 2023 4:56 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story