MLA Raghunandan Rao |
విధాత, మెదక్ బ్యూరో: జీవితంలో మంత్రి పదవి కాదని సిద్ధాంతాన్ని మరిచి పార్టీ మార్చిన వ్యక్తి ఎర్రవల్లి దయాకర్ రావు అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కు సంగీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు గ్రామ సచివాలయంలో కూర్చొని సమస్యలు చూశారా అని మండి పడ్డారు.
తెలంగాణ కు అనేక అవార్డులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా 24 గంటలు పనిచేస్తున్నారు. సెక్రెటరీయేట్ రాని ముఖ్యమంత్రి దేశంలో ఏ సీఎం తీసుకొని జీతం తీసుకుంటున్నాడని విమర్శించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శులు ఎంతో పని చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కొడుకు,బిడ్డను తీసుకొని టెంట్లు వేసుకొని కూర్చోవడం బాధాకరం అన్నారు.
ఎక్కడ భూములు అమ్మాలి..మాకు ఏం వస్తుంది అని ఆలోచిస్తున్నారు. జై తెలంగాణ అన్నోళ్లకు కేసీఆర్ దగ్గర ఏమి రావ్..సూట్కేసులు పట్టుకొచ్చినోళ్ళకు వస్తాయని అన్నారు.ఒక్క పార్టీ నుంచి వచ్చినోళ్ళకు మంత్రులు చేసిండ్రు సీఎం అని దుయ్య బట్టారు.
ఉద్యమంలో దెబ్బలు తిన్నాం.
తెలంగాణ వస్తే రాష్ట్రం వచ్చిన తెల్లారి నుంచి కాంట్రాక్ట్ అనే పదం ఉండదు ఆన్నారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం అన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఎండాకాలం వానలు వస్తే హైదరాబాద్ చేరవులను తలపిస్తుంది.
మల్టీ పర్పస్ వర్కర్లకు జీతాలు ఇయ్యనోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్నాడని విమర్శించారు.
పంచాయితీ సెక్రెటరీ లకు జీతాలు ఇవ్వకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని మండి పడ్డారు.
33 జిల్లాల కలెక్టరేట్ ల వద్ద టెంటు వేసుకొని కూర్చున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండి పడ్డారు.
సీఎం కేసీఆర్ ను మహారాష్ట్ర కు పంపిస్తాం.చర్చలకు పిలిచి 10 గంటల వరకు డ్యూటికి వెళ్లకపోతే టర్మనెంట్ చేస్తామనడం జూనియర్ పంచాయితీలు పీకుడు కేసీఆర్, కేటీఆర్ లకు లేదు .నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన పంచాయతీ కార్యదర్శులను పీకేసే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో క్వార్టర్ ధర తగ్గించిండని మండిపడ్డారు.