MLA Saidireddy విధాత: హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ నెల 26 శుక్రవారం జరిగే మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిల పర్యటనను విజయవంత చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటగా నేరేడుచర్లలో బస్తీ దావఖాన ప్రారంభోత్సవం, పొనుగోడులో పల్లె దావఖాన ప్రారంభోత్సవం, హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ లో రివ్యూ మీటింగ్, మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక […]

MLA Saidireddy

విధాత: హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈ నెల 26 శుక్రవారం జరిగే మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిల పర్యటనను విజయవంత చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ

మొదటగా నేరేడుచర్లలో బస్తీ దావఖాన ప్రారంభోత్సవం, పొనుగోడులో పల్లె దావఖాన ప్రారంభోత్సవం, హుజూర్ నగర్ ప్రభుత్వ హాస్పటల్ లో రివ్యూ మీటింగ్, మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం బిఆర్ఎస్ పార్టి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజా ఆరోగ్య విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే దిక్సూచి లా ఆవిర్భవించిందన్నారు. విదేశాల నుంచి కంపెనీలని తీసుకురావడంలో దేశం మొత్తంలో కూడా తెలంగాణనే నెంబర్ వన్ అన్నారు.

అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూసే వ్యక్తి సీఎం కేసీఆర్ పాలనకు దేశవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందని, ప్రతి కార్యకర్తని కూడా బిఆర్ఎస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం ఉద్యమించిన ఏకైక పార్టీ బిఆర్ఎస్ అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలతో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచాలకు తెలిసేలా 21 రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగేలా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భాగస్వామ్యం కావాలన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని గడపగడపకు వివరించడం జరుగుతుందన్నారు.

Updated On 25 May 2023 4:54 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story