MLA SEETHAKKA | బిజీ జీవితంలోనూ కొనసాగిస్తున్న చదువు ఇప్పటికే డాక్టరేట్ పూర్తి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిత్యం నియోజకవర్గంలో ప్రజలతో, ప్రజా సమస్యలతో కుస్తీపడే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. మరోవైపు తన అభిరుచిని మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనసాగిస్తూనే ఉంది. చదువుకోవాల్సిన వయస్సులో విప్లవ ఉద్యమంలో భాగస్వామ్యమైంది. తదుపరి ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తన ఆకాంక్షను నెరవేర్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే విద్యపై ఆమెకున్న మమకారాన్ని తీర్చుకుంటోంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ […]

MLA SEETHAKKA |
- బిజీ జీవితంలోనూ కొనసాగిస్తున్న చదువు
- ఇప్పటికే డాక్టరేట్ పూర్తి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిత్యం నియోజకవర్గంలో ప్రజలతో, ప్రజా సమస్యలతో కుస్తీపడే ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. మరోవైపు తన అభిరుచిని మాత్రం ఎన్ని అడ్డంకులు ఎదురైనా కొనసాగిస్తూనే ఉంది. చదువుకోవాల్సిన వయస్సులో విప్లవ ఉద్యమంలో భాగస్వామ్యమైంది.
తదుపరి ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తన ఆకాంక్షను నెరవేర్చుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే విద్యపై ఆమెకున్న మమకారాన్ని తీర్చుకుంటోంది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు. మరోవైపు తనకి ఇష్టమైన లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, లాయర్ గా కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంది. తాజాగా లా పీజీ చదువుతోంది.
🔥After death we only take knowledge & good deeds with us apart from that you can’t take your pride, position or wealth..
🔥Only education have power to full fill your dreams, today gave my LLM external exam in Osmanina university of law college. @RahulGandhi @priyankagandhi pic.twitter.com/AOOKwBZArK— Danasari Seethakka (@seethakkaMLA) September 1, 2023
అందులోభాగంగానే ఎల్ఎల్ఎం ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ను శుక్రవారం రాశారు. ఉస్మానియా లా కాలేజీలో పరీక్షకు హాజరయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నికల వేళ కూడా సమయం కల్పించుకొని చదువును కొనసాగించడం ఎంతైనా అభినందనీయం.
చదువుతోనే కలలు సాకారం : సీతక్క
చదువుతో మాత్రమే కలలు సాకరమవుతాయి. మనం చనిపోయిన తర్వాత కీర్తి, సంపద, అధికారం వెంటరావు. కేవలం మనం చేసిన మంచి పనులు, జ్ఞానం మాత్రమే మనల్ని గుర్తుంచుకునేలా చేస్తాయి.
