MLA Shiva Prasad | పొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లు ఆదర్శం విధాత‌: పేదలు మా కుటుంబ సభ్యులు.. వాళ్ళ సంక్షేమమే నా సంతోషం అని చెప్పే నాయకులను చూశాం కానీ చెప్పినమాట మీద నిలబడే వాళ్ళు తక్కువే.. అక్కడక్కడా కనిపిస్తారు. దానికి తోడు సంపన్నులకు, పేదలకు మధ్య ఎన్నడూ దూరమే తప్ప దగ్గరితనం ఉండదు. కులాలు లేవు..మతాలు లేవు.. మనదంతా ఒకే కులం అని చెప్పడం సులువే.. కానీ పాటించడం చాలా కష్టం.. కానీ ఓ సంపన్నుడైన […]

MLA Shiva Prasad |

  • పొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లు ఆదర్శం

విధాత‌: పేదలు మా కుటుంబ సభ్యులు.. వాళ్ళ సంక్షేమమే నా సంతోషం అని చెప్పే నాయకులను చూశాం కానీ చెప్పినమాట మీద నిలబడే వాళ్ళు తక్కువే.. అక్కడక్కడా కనిపిస్తారు. దానికి తోడు సంపన్నులకు, పేదలకు మధ్య ఎన్నడూ దూరమే తప్ప దగ్గరితనం ఉండదు. కులాలు లేవు..మతాలు లేవు.. మనదంతా ఒకే కులం అని చెప్పడం సులువే.. కానీ పాటించడం చాలా కష్టం..

కానీ ఓ సంపన్నుడైన ఎమ్మెల్యే తన బిడ్డను ఓ సాధారణ మెకానిక్ కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసి అందరి చేత ఔరా అనిపించారు. ఈ పెళ్లి కూడా అత్యంత సాధారణంగా రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన కుమార్తె పల్లవి వివాహాన్ని ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దగ్గరుండి జరిపించారు.

లీలా గోపీ పవన్ కుమార్‌ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. సబ్ రిజిస్టార్ కార్యలయానికి రాకముందు సాంప్రదాయ బద్దంగా, అత్యంత నిరాడంబరంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మధ్య వివాహం జరిగిన అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించారు.

పెళ్ళికొడుకు తండ్రి ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్నారని, పెళ్ళికొడుకు ఎంబీఎ చదివి హైదరాబాదులో రూ.80 వేల జీతానికి ఉద్యోగం చేస్తున్నాడని, తాను.. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేశానని.. తన బిడ్డను మనస్ఫూర్తిగా ఆశీర్విదిస్తున్నానని తెలిపారు.

దీంతో కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తన కుమార్తెతో కలిసి చదువుకున్న రోజుల్లో ప్రేమించిన కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయడం తనకూ సంతోషమే అని ఎమ్మెల్యే అన్నారు.

Updated On 8 Sep 2023 7:34 AM GMT
somu

somu

Next Story