ఢిల్లీ రాంలీలా మైదానంలో మోదీ వ్యవసాయ విధానాలపై రైతు సంఘాల నిరసనోద్యమం విధాత: ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ పెరుగుతున్నది. మోదీ మాతృసంస్థ RSS అనుబంధంగా ఉన్న భారతీయ కిసాన్ సంఘ్‌ (బీకేఎస్‌) నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మోదీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు నిరసనగళం వినిపించారు. దాదాపు 30నుంచి 35వేల మంది పాల్గొన్న రైతు నిరసన సభలో బీకేఎస్‌ నేతలు మోదీ విధానాలను తీవ్రంగా గర్హించారు. […]

  • ఢిల్లీ రాంలీలా మైదానంలో మోదీ వ్యవసాయ విధానాలపై రైతు సంఘాల నిరసనోద్యమం

విధాత: ప్రధాని నరేంద్ర మోదీకి నిరసన సెగ పెరుగుతున్నది. మోదీ మాతృసంస్థ RSS అనుబంధంగా ఉన్న భారతీయ కిసాన్ సంఘ్‌ (బీకేఎస్‌) నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. మోదీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలోని రాంలీలా మైదానంలో రైతులు నిరసనగళం వినిపించారు. దాదాపు 30నుంచి 35వేల మంది పాల్గొన్న రైతు నిరసన సభలో బీకేఎస్‌ నేతలు మోదీ విధానాలను తీవ్రంగా గర్హించారు.

వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన రైతులు రాంలీలా మైదానంలో దేశ వ్యాప్త రైతు నిరసనోద్యమానికి ప్రతీకగా నిలిచారు. తమిళ్‌, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీ భాషల్లో నినాదాలు మారుమోగాయి. దేశ వ్యాప్తంగా 550 జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నట్లు తెలుస్తున్నది.

బీకేఎస్‌ జాతీయ అధ్య‌క్షుడు హరికుమార్‌ సింఘ్‌ మాట్లాడుతూ.. మోదీ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. తాను అధికారంలోకి వస్తే.. రైతులు ఎదుర్కొంటున్న వీధి గోవుల బాధ నుంచి రైతులకు విముక్తి కలిగిస్తానని మోదీ మాట ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చి ఎనిమిదేండ్లు అవుతున్నది.

అయినా వీధి గోవుల బాధలు తీరటం లేదు. తమ పంటలు కాపాడుకోవటం కోసం రాత్రింబగుళ్లు చేను, చెల్కల దగ్గరే ఉండాల్సి వస్తున్నదని వాపోయారు. మోదీ హామీ ఇచ్చిన ఏ మాట నిలుపుకోలేదని బీకేఎస్‌ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాగే.. బీకేఎస్‌ జాతీయ కార్యదర్శి కూడా మోదీ మాట తప్పాడని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీ ఇచ్చి మరిచి పోయాడని అన్నారు. పీఎం కిసాన్‌ యోజన పథకం ఆర్థిక మొత్తాన్ని పెంచాలని డిమాండ్‌ చేశారు. అలాగే.. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలన్నీ రైతు వ్యతిరేక మైనవేనని విమర్శించటం గమనార్హం.

ఇన్నాళ్లూ.. దేశంలోని విపక్షాలు, విపక్షాల అనుబంధ రైతు సంఘాలు, పంజాబ్‌, యూపీలోని స్వంత్ర రైతు సంఘాలు మాత్రమే మోదీ వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తున్నాయన్న భావన ఉండేది. ఇప్పుడు ఏకంగా బీజేపీ మాతృ సంస్థ RSS అనుబంధ సంస్థ బీకేఎస్‌ మోదీపై దండెత్తటం గమనించదగిన పరిణామం. ఒక రకంగా.. మోదీకి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Updated On 20 Dec 2022 12:04 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story