ప్రభుత్వ రంగ ఆస్తుల వెతుకులాటలో మంత్రిత్వ శాఖలు ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్న కేంద్రం విధాత: మోదీ ప్రభుత్వం పాలనా వ్యవహారాల అవసరాల కోసం నిధుల వేటలో పడింది. ఇప్పటికే లెక్కకు మించి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మింది కేంద్రం. తాజాగా ఆయా మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న ఆస్తులు ఇంకా ఏమేమి అమ్మకానికి పెట్టొచ్చో తెలపాలని కోరింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టడానికి మోదీ ప్రభుత్వం ముద్దుగా మానిటైజేషన్ అని పేరుపెట్టింది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక […]

Is Modi government in cahoots with pharma mafia?
- ప్రభుత్వ రంగ ఆస్తుల వెతుకులాటలో మంత్రిత్వ శాఖలు
- ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్న కేంద్రం
విధాత: మోదీ ప్రభుత్వం పాలనా వ్యవహారాల అవసరాల కోసం నిధుల వేటలో పడింది. ఇప్పటికే లెక్కకు మించి ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మింది కేంద్రం. తాజాగా ఆయా మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న ఆస్తులు ఇంకా ఏమేమి అమ్మకానికి పెట్టొచ్చో తెలపాలని కోరింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టడానికి మోదీ ప్రభుత్వం ముద్దుగా మానిటైజేషన్ అని పేరుపెట్టింది.
ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (NMP) కింద ఇప్పటికే రూ.33,422 కోట్ల విలువైన ఆస్తులను మానిటైజ్ చేసింది. ఈ నేపథ్యంలో బొగ్గు గనుల శాఖ రూ.17,000 కోట్లను సమకూర్చింది.
2022-23కు రూ.1,62,422 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా.. 7 నెలల్లో రూ.33 వేల కోట్లు మాత్రమే సేకరించగలిగింది. గతేడాది 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం మొత్తం రూ.88,000 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా రూ.లక్ష కోట్లతో అనుకున్న లక్ష్యాన్ని అధిగమించింది. ప్రస్తుత 2022-23 సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకొన్న రూ.1,62,422 లను చేరుకోవటం దుర్లభమేనని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆయా శాఖలను ఆస్తులను అమ్మి మానిటైజ్ చేసే ప్రక్రియను వేగిరం చేయాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే, టెలికాం శాఖలు మానిటైజేషన్ ప్రక్రియను వచ్చే ఏడాది దాకా వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
