ఫిబ్రవరిలో క్యాబినెట్ రద్దు చేసే యోచనలో బీజేపీ ప్రభుత్వం డిసెంబర్‌లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు విధాత: బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నది. విపక్షాలు ఎన్నికలకు సిద్దం కాకముందే ఎన్నికల భేరీ మోగించాలని బీజేపీ యోచిస్తున్నది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం ఊహాగానాలకు తెర లేపింది. కేంద్రం డిసెంబర్‌లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమైంది. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి మంత్రి వర్గాన్ని రద్దు చేయాలన్న ఆలోచనలో మోడీ […]

- ఫిబ్రవరిలో క్యాబినెట్ రద్దు చేసే యోచనలో బీజేపీ ప్రభుత్వం
- డిసెంబర్‌లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
విధాత: బీజేపీ ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నది. విపక్షాలు ఎన్నికలకు సిద్దం కాకముందే ఎన్నికల భేరీ మోగించాలని బీజేపీ యోచిస్తున్నది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం ఊహాగానాలకు తెర లేపింది. కేంద్రం డిసెంబర్‌లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్దమైంది.
ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి మంత్రి వర్గాన్ని రద్దు చేయాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అంతేగాక ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతలందరినీ ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. కాగా ఆర్థిక సాయం అందించే పథకాలను వేగవంతం చేయాలని ప్రధాని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
