Monsoon | ఎండ‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. మ‌రో 48 గంట‌ల్లో నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అయితే తాజాగా ఆగ్నేయి అరేబియా స‌ముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను కార‌ణంగా నైరుతి రుతుప‌వ‌నాలు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల‌పై వాతావ‌ర‌ణ శాఖ స్పందించింది. రుతుప‌వ‌నాల రాక‌కు ద‌క్షిణ అరేబియా స‌ముద్రం, ల‌క్ష‌ద్వీప్, వాయువ్య‌, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు […]

Monsoon | ఎండ‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్ర‌జ‌ల‌కు వాతావ‌ర‌ణ శాఖ చ‌ల్ల‌ని క‌బురు అందించింది. మ‌రో 48 గంట‌ల్లో నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అయితే తాజాగా ఆగ్నేయి అరేబియా స‌ముద్రంలో ఏర్పడిన బిపోర్ జాయ్ తుపాను కార‌ణంగా నైరుతి రుతుప‌వ‌నాలు ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంద‌న్న వార్త‌ల‌పై వాతావ‌ర‌ణ శాఖ స్పందించింది.

రుతుప‌వ‌నాల రాక‌కు ద‌క్షిణ అరేబియా స‌ముద్రం, ల‌క్ష‌ద్వీప్, వాయువ్య‌, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.. దీంతో రానున్న 48 గంట‌ల్లో నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ తీరాన్ని తాకే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.

ఇక అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన బిపోర్ జాయ్ తుపాను వేగంగా బ‌ల‌ప‌డుతున్న నేప‌థ్యంలో తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను వాతావ‌ర‌ణ శాఖ అప్ర‌మ‌త్తం చేసింది. రాగ‌ల మూడు రోజుల్లో ఇది ఉత్త‌రాన - వాయువ్య దిశ‌లో క‌దిలే అవ‌కాశ‌మున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. స‌ముద్రంలోకి ఎవ‌రూ వెళ్లొద్ద‌ని హెచ్చ‌రించింది.

Updated On 7 Jun 2023 1:55 PM GMT
subbareddy

subbareddy

Next Story