Dengue Patient | విధాత: ఓ డెంగీ రోగి పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించారు. బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. ఇంకేముంది ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ పాండే అనే రోగి గత కొద్ది రోజుల నుంచి డెంగీతో బాధపడుతున్నాడు. పాండేకు ప్లేట్ లెట్స్ పడిపోయాయి. దీంతో చికిత్స నిమిత్తం ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ […]

Dengue Patient | విధాత: ఓ డెంగీ రోగి పట్ల వైద్యులు నిర్లక్ష్యం వహించారు. బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. ఇంకేముంది ఆ రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో వెలుగు చూసింది.


వివరాల్లోకి వెళ్తే.. ప్రదీప్ పాండే అనే రోగి గత కొద్ది రోజుల నుంచి డెంగీతో బాధపడుతున్నాడు. పాండేకు ప్లేట్ లెట్స్ పడిపోయాయి. దీంతో చికిత్స నిమిత్తం ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేశారు. అయితే బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. అది ఎక్కించిన కాసేపటికే.. రోగి చనిపోయాడు. దీంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రదీప్ చనిపోయాడని బంధువులు ఆరోపించారు.


ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పఠాక్ స్పందించారు. రోగి మృతిపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంబంధిత ఆస్పత్రి వద్దకు కమిటీ వెళ్లిందని, విచారణ జరుపుతుందని పేర్కొన్నారు. నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.


ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేశ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు కమిటీ విచారణ జరుపుతుందన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ తెలిపారు.

Updated On 22 Oct 2022 1:28 AM GMT
subbareddy

subbareddy

Next Story