Saturday, December 3, 2022
More
  Homehealth‘హీమోఫీలియా B’: ప్ర‌పంచంలోనే అత్యంత ఖరీదైన చికిత్స.. ఖ‌రీదు రూ.28.5 కోట్లు

  ‘హీమోఫీలియా B’: ప్ర‌పంచంలోనే అత్యంత ఖరీదైన చికిత్స.. ఖ‌రీదు రూ.28.5 కోట్లు

  • ఒక డోసు ఖ‌రీదు సుమారు రూ.28.5 కోట్లు

  విధాత‌: ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన వైద్యం ఏంటో తెలుసా? ఒక డోసు మందు ఖ‌రీదు సుమారు 28.5కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌య్యే ఆ మందును ఏ వ్యాధికి, ఎందుకు వాడుతారో తెలుసా? ఇంత ఖ‌రీదైన మందుకు అమెరికా ప్ర‌భుత్వం అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఏదైనా గాయం అయిన‌ప్పుడు ర‌క్తం గ‌డ్డ‌ క‌డ్డ‌కుండా స్ర‌వించే వ్యాధిని హీమోఫీలియా అంటారు.

  యూఎస్ రెగ్యులేటర్లు సీఎస్ఎల్ బెహ్రింగ్ సంస్థ‌ హీమోఫీలియా చికిత్స‌కు బి జీన్ థెరపికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న చికిత్స‌ల స్థానంలో ఇక నుంచి హీమోఫీలియా బి నివార‌ణ‌కు ఈ చికిత్సను అందిస్తారు. ఈ చికిత్స చాలా ఖరీదైనదిగా చెప్పాలి. ఒకడోస్ దాదాపు 3.5 మిలియన్ డాలర్ల వరకు ఖరీదు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెప్పవచ్చు.

  వారిలో ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌దు..

  ఏదైనా గాయం అయినపుడు కొన్ని నిమిషాల్లోనే రక్త స్రావం సహజంగానే నిలిచిపోతుంది. ఇలా రక్త స్రావం ఆగేందుకు గాలి తగిలిన కొన్ని నిమిషాల్లోనే రక్తం గడ్డకడుతుంది. గాయం నుంచి రక్తం స్రవించడాన్ని అడ్డుకుంటుంది. ఇలా జరగకపోతే రక్తస్రావం జరిగి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండేందుకు శరీరంలో ఈ ఏర్పాటు సహజంగా ఉంటుంది.

  అలా రక్తం గడ్డకట్టడానికి గాను రక్తంలో కొన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే కొందరిలో ఈ ఫ్యాక్టర్స్ లోపించడం లేదా తగిన స్థాయిలో ఉండవు. ఇలాంటి వారిలో రక్త స్కందనం జరగదు. ఈ పరిస్థితిని హీమోపీలియా అంటారు. ఇది సాధారణంగా పుట్టుకతో వచ్చే సమస్య, చాలా అరుదుగా పుట్టుక తర్వాత కనిపిస్తుంది.

  ఎందుకు వస్తుంది?

  హీమోఫీలియా సాధారణంగా జన్యువుల్లో జరిగే పరిణామం వల్ల వచ్చే సమస్య. ఈ పరిణామం వల్ల ఒక జన్యువులో మార్పు వస్తుంది. ఈ మార్పు వల్ల శరీరంలో రక్త స్కందనకు ఉపయోగపడే ప్రొటీన్ తయారీ నిలిచి పోవడం, లేదా తయారైన ప్రొటీన్ పనితీరు సరిగ్గా లేకపోవడం వల్ల రక్తస్కందన ప్రక్రియ సజావుగా సాగదు. సాధారణంగా ఈమార్పు ఎక్స్ క్రోమోజోమ్ లో జరుగుతుంది. పురుషుల్లో ఒకటి, స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమజోములు ఉంటాయి.

  లక్షణాలు

  • కారణం లేకుండా రక్తస్రావం జరగడం, గాయాలు, సర్జరీల సమయంలో రక్త స్రావం అదుపులో లేకపోవడం.
  • శరీరంలో పెద్ద పెద్ద రక్తపు మరకల వల్ల చర్మం కందిపోయినట్టు కనిపిస్తుంది.
  • వ్యాక్సినేషన్ తర్వాత అసాధారణ రక్తస్రావం.
  • కీళ్లలో నొప్పి, వాపు, బిగుసుకు పోయిన భావన.
  • మల, మూత్రాలలో రక్తం కనిపిస్తుంది.
  • ముక్కు నుంచి కారణం లేకుండానే రక్త స్రావం.
  • పసి పిల్లలు కారణం లేకుండానే విసుగ్గా, ఏడుస్తూ ఉంటారు.

  ప్రాణాంతకం కూడా కావచ్చు

  • కీళ్ల లో రక్తస్రావం జరుగుతుంది అందువల్ల ఇది ప్రత్యేకమైన కీళ్ల జబ్బుకు కారణం కావచ్చు.
  • తలలో రక్త స్రావం జరిగితే మెదడు దెబ్బతింటుంది. మూర్చ లేదా పక్షవాతం వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌.
  •  మెదడు వంటి వైటల్ ఆర్గాన్స్ లో జరిగే రక్తస్రావం ప్రాణాంతకం కావచ్చు కొన్ని సందర్భాల్లో.
   అయితే ఈ సమస్యకు ఇప్పటి వరకు సరైన చికిత్స అందుబాటులో లేదు. తాము చేస్తున్న పరిశోధనల్లో ఒక ముందడుగు పడ్డట్టు యూస్ పరిశోధకులు అంటున్నారు. దీనికి జీన్ థెరపిని ఉపయోగించి సరైన చికిత్స అందించడం సాధ్యమవుతుందని, హీమోఫీలియా రావడానికి కారణమయ్యే మూలాలను జీన్ థెరపీ ద్వారా సరిచేస్తే సరిపోతుందని చెప్తున్నారు.

  జీన్ థెర‌పీకి గ్రీన్ సిగ్న‌ల్‌

  యూఎస్ రెగ్యూలేటర్లు సీఎస్ ఎల్ బెహ్రింగ్ వారి హీమోఫీలియా బి జీన్ థెరపికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న హీమోఫీలియాను అదుపుచేసే చికిత్స‌ల స్థానంలో ఇక నుంచి ఈ చికిత్సను అందిస్తారు. అయితే ఈ చికిత్స చాలా ఖరీదైనదిగా చెప్పాలి. ఒకడోస్ దాదాపు 3.5 మిలియన్ డాలర్ల వరకు ఖరీదు చేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా చెప్పవచ్చు.

  ఖరీదే.. కానీ స‌త్ఫ‌లితాలు..

  ఈ హీమోజెనిక్స్ చికిత్స ఒక సిట్టింగ్ తో పూర్తవుతుంది. హీమోఫీలిక్ పేషెంట్లలో రక్తస్రావం జరిగే సందర్భాలను దాదాపు 54 శాతం వరకు తగ్గించినట్టు ఇక్కడి నిపుణులు చెబుతున్నారు. 94 శాతం మంది హీమోఫీలిక్ రోగుల్లో ఫ్యాక్టర్ IX లోపానికి ఉపయోగించే ఖరీదైన మందులు వాడకం నుంచి విముక్తి దొరికనట్టు కూడా ఈ అధ్యయనం ధృవీకరిస్తోంది.

  కొంచెం ఖరీదైనప్పటికీ అనుకున్న ఫలితాలను సాధిస్తుందనడానికి తన వద్ద కారణాలు ఉన్నాయని బయోటెక్నాలజీ ఇన్వెస్టర్ అండ్ చీఫ్ ఎక్స్‌క్యూటీవ్‌ ఆఫీసర్ బ్రాడ్ లాన్ కార్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న మందులు కూడా చాలా ఖరీదైనవే అదీకాక హీమోఫీలియా పేషెంట్లు ప్రతిక్షణం రక్త స్రావ భయంలోనే జీవిస్తుంటారు. ఇలాంటి దినదిన గండం నుంచి ఈ జీన్ థెరపీ బయటపడేస్తుందనేది ఆయన అభిప్రాయం.

  జీన్ థెర‌పీతో మూల కార‌ణానికి చికిత్స‌

  జీన్ థెరపీలు సాధారణంగా లక్షణాలు తగ్గించడం కాకుండా మూల కారణానికి చికిత్సను అందిస్తాయి. అందువల్ల స్పైన్, మస్కూలార్ డిస్ట్రోఫీ వంటి సమస్యలకు జీన్ థెరపీకి ఆమోదం దొరికినపుడు ఆ చికిత్సల ఖరీదు కూడా దాదాపు 2.1 మిలియన్ డాలర్లుగానే ఉంది.

  తలసేమియా చికిత్సకు 2.8 మిలియన్లుగా ఉంది. వీటితో పోల్చినపుడు ఇది ఇంకా ఖరీదైనదే, కానీ ఫలితాలు కచ్చితంగా ఉంటాయని బయోథెరపిస్టులు అంటున్నారు. అల్జీమర్స్ కు వాడే అడుహెల్మ్, బ్లూబర్డ్ జింటెగ్లో వంటి మందులు కూడా ఖరీదైనవే. వీటికి ధ‌ర నిర్ణయించడం నిజానికి చాలా కష్టంగా మారిందని ఈ డ్రగ్ కంపెనీలు చెబుతున్నాయి.

  ఒక్క డోస్‌తో స‌మ‌స్య‌ అదుపులో..

  హీమోఫిలియా చికిత్సలో పరిశోధనలు ముందుకు సాగినప్పటికీ ఇప్పుడు వాడుతున్న మందులు వారి జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయని యూఎస్ కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యూయేషన్ అండ్ రీసెర్చ్ కు చెందిన పీటర్ మార్క్స్ అన్నారు. హీమోజెనిక్స్ ఇప్పుడు సాధించిన దాన్ని తప్పకుండా అభినందించాల్సిందే ఎందుకంటే ఒకేఒక డోస్ తో సమస్యను దాదాపుగా అదుపులో ఉంచడం సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  లోపించిన ప్రొటీన్ల ఉత్ప‌త్తికి దోహ‌దం..

  ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మందులు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గా పిలుచుకునే ప్రొటీన్లను ఇన్ఫ్యూజ్ చేసి రక్త స్కందనకు తోడ్పడుతాయి. అయితే కొత్త హీమోజెనిక్ మందులు శరీరంలో లోపించిన ఈ ప్రోటీన్లను లివర్ ఉత్పత్తి చేసేందుకు దోహదం చేస్తాయి. అందువల్ల లివర్ ఫ్యాక్టర్ IX ప్రోటీన్ ను తయారు చెయ్యడం మొదలుపెడుతుంది. ఫలితంగా ఈ ప్రొటీన్ లేనందువల్ల రక్త స్రావం జరిగే పేషెంట్లలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని ఈ బయోజెనిక్ కంపెనీలు చెబుతున్నాయి.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page