Viral Video | తల్లిదండ్రులను పిల్లలు చిత్రవిచిత్ర ప్రశ్నలు అడుగుతుంటారు. పెళ్లి నాటి ఫోటోలు చూపిస్తే.. నేను ఎక్కడా ఉన్నాను అమ్మా..? అని అడుగుతారు.
సీమంతం నాటి ఫోటోలు చూపిస్తే.. అమ్మా ఆ ఫోటోలో నేను లేనా..? అడుగుతారు. అలాంటి ప్రశ్నలకు తల్లిదండ్రులు స్మూత్‌గా సమాధానం చెప్పేస్తుంటారు.
అయితే ఓ తల్లిని తన కూతురు.. అమ్మా పిల్లలు ఎలా పుడుతారు? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆ తల్లి మాత్రం ప్రాక్టికల్‌గా చేసి చూపించింది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.
నారింజ పండును గర్భిణిగా చూపిస్తూ.. ఆస్పత్రిలో సీజేరియన్ ప్రక్రియ ఎలా సాగుతుందో చేసి చూపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తల్లి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
A child asked her Mom, how are babies born?
Here is what she did….😀 pic.twitter.com/VfIudupj8P— Harsh Goenka (@hvgoenka) May 20, 2023