Vijay Devarakonda | విధాత : సినీ హీరో విజయ్ దేవరకొండ ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఖుషీ చిత్ర బృందంతో కలిసి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. My Family has been blessed this year with lots of love & Kushi ❤️ Visited the […]

Vijay Devarakonda | విధాత : సినీ హీరో విజయ్ దేవరకొండ ఆదివారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఖుషీ చిత్ర బృందంతో కలిసి స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

నూతన ఆలయాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా నిర్మింపచేసిందని, ఇందుకు ప్రభుత్వానికి తాను కృతజ్తలు తెలుపుతున్నానన్నారు. పదేళ్ల క్రితం ఆలయానికి వచ్చానని, ఇప్పడు అద్భుత శిల్పాకళతో నిర్మించిన నూతన ఆలయం చూసి ఎంతో సంతోషించానన్నారు. ఖుషీ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన విజయ్ దేవరకొండ బృందానికి ఆలయ ఈవో గీత స్వామివారి లడ్డూ ప్రసాదాలు అందించారు. అర్చకులు ఆశీర్వచనం పలికారు.

Updated On 3 Sep 2023 3:34 PM GMT
somu

somu

Next Story