Komatireddy | విధాత, హైదరాబాద్: కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, రైతులకు ఇబ్బంది తప్పేలా లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తన పర్యటనల్లో ‘2, 3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా… 24 గంటలు కరెంట్ కావాలా’ అని ప్రజలకు చెబుతుంటారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా 12, 13 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ రానున్న రోజుల్లో […]

Komatireddy | విధాత, హైదరాబాద్: కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, రైతులకు ఇబ్బంది తప్పేలా లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తన పర్యటనల్లో ‘2, 3 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలా… 24 గంటలు కరెంట్ కావాలా’ అని ప్రజలకు చెబుతుంటారని, రాష్ట్రంలో ఎక్కడ కూడా 12, 13 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇవ్వడం లేదన్నారు.
కేసీఆర్ సర్కార్ రానున్న రోజుల్లో ఇందులో కూడా కోత విధిస్తుందని తెలిపారు. ఇప్పటికీ కరెంట్ కోతలపై నల్గొండ మండలం నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అప్పాజీ పేటలో వారం నుంచి కనీసం 6 గంటలు కూడా కరెంట్ రాక, పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ కొరత ఉంటే పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసైనా ప్రజలకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మాటల నమ్మి రైతులు నాట్లు వేసుకున్నారని, నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతు బంధు డబ్బులు రైతు తెచ్చిన పెట్టుబడికి వడ్డీ కట్టేందుకు కూడా సరిపోవడం లేదని విమర్శించారు. మూడు నెలల తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనీ, కనీసం ఈ నెల రోజులైనా 24 గంటల కరెంట్ ఇవ్వాలని కోరారు.
