విధాత: కూలీల‌కు వ‌జ్రాల పంట పండింది. రాత్రికి రాత్రే ల‌క్షాధికారులు అయిపోయారు. రెండు రోజుల్లోనే ఆ కూలీల‌కు 15 డైమండ్లు దొరక‌డంతో వార్త‌ల్లోకి ఎక్కారు. ఇప్పుడంతా ఆ కూలీల గురించే మాట్లాడుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బుందేల్‌ఖాండ్ రీజియ‌న్‌లోని ప‌న్నాలో రెండు రోజుల్లో 15 వ‌జ్రాలు దొరికాయి. వీటి బరువు 35.86 క్యారెట్లు. వీటిని వేలం వేస్తే దాదాపు రూ. కోటి వస్తా‌యని గనుల శాఖ అధి‌కారి వెల్ల‌డిం‌చారు. ప్ర‌కాశ్ ముజాంద‌ర్ అనే కూలీకి 3.64 క్యారెట్ల […]

విధాత: కూలీల‌కు వ‌జ్రాల పంట పండింది. రాత్రికి రాత్రే ల‌క్షాధికారులు అయిపోయారు. రెండు రోజుల్లోనే ఆ కూలీల‌కు 15 డైమండ్లు దొరక‌డంతో వార్త‌ల్లోకి ఎక్కారు. ఇప్పుడంతా ఆ కూలీల గురించే మాట్లాడుకుంటున్నారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బుందేల్‌ఖాండ్ రీజియ‌న్‌లోని ప‌న్నాలో రెండు రోజుల్లో 15 వ‌జ్రాలు దొరికాయి. వీటి బరువు 35.86 క్యారెట్లు. వీటిని వేలం వేస్తే దాదాపు రూ. కోటి వస్తా‌యని గనుల శాఖ అధి‌కారి వెల్ల‌డిం‌చారు.

ప్ర‌కాశ్ ముజాంద‌ర్ అనే కూలీకి 3.64 క్యారెట్ల బ‌రువున్న వ‌జ్రం దొరికిన‌ట్లు గ‌నుల శాఖ అధికారులు పేర్కొన్నారు. క‌ల్లు సోంకార్‌కు 6.81 క్యారెట్ల డైమండ్, రాజేశ్ జైన్‌కు 2.28 క్యారెట్ల డైమండ్, రాహుల్ అగ‌ర్వాల్‌కు 4.32 క్యారెట్ల డైమండ్, రాజ‌భాయ్ రైక్వార్‌కు 1.77 క్యారెట్ల డైమండ్ ల‌భించిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ వ‌జ్రాల‌న్నీ కృష్ణ‌క‌ల్యాణ్‌పురి పాటి గ‌నుల్లో బుధ‌వారం రోజు దొరికాయ‌న్నారు.

ఆ ఒక్క కూలీకే ఆరు వ‌జ్రాలు..

ద‌మ్‌కాన్ అహివార్ అనే కూలీ అదృష్ట‌వంతుడు అని చెప్పొచ్చు. ఆ ఒక్క‌డికే 2.46 క్యారెట్ల బ‌రువు గ‌ల ఆరు డైమండ్లు దొరికాయి. గురువారం రోజు అహివార్‌తో పాటు మ‌రి కొంత‌మంది కూలీల‌కు కూడా వ‌జ్రాలు దొరికాయి. అశోక్ ఖారేకు 6.37 క్యారెట్లు, జ‌గ‌న్ జాడియాకు 4.74 క్యారెట్లు, ల‌ఖాన్ కేవ‌త్‌కు 3.47 క్యారెట్ల బ‌రువున్న డైమండ్లు దొరికిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ వజ్రా‌ల‌న్నిం‌టినీ డైమండ్‌ ఆఫీ‌స్‌లో డిపా‌జిట్‌ చేశా‌మని, అక్టో‌బర్‌ 18న వేలం వేస్తా‌మని అధి‌కారి ప్రక‌టిం‌చారు. ముడి వజ్రా‌లను వేలం వేస్తా‌మని, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు పోనూ మిగి‌లిన సొమ్మును వాటిని సేక‌రిం‌చి‌న‌వా‌రికి అంద‌జే‌స్తా‌మని అధి‌కారి తెలి‌పారు.

Updated On 1 Oct 2022 3:21 AM GMT
subbareddy

subbareddy

Next Story