చైనా మ్యాప్‌పై ప్రధాని నోరు తెరవాలి ఇది చాలా తీవ్రమైన అంశం Rahul Gandhi | న్యూఢిల్లీ : లద్దాఖ్‌లో చైనా, భారత్‌ భూ వివాదంపై ప్రధాని మోదీ అనేక సంవత్సరాలుగా జాతికి అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయి చిన్‌ ప్రాంతాలు కూడా తమవేనంటూ చైనా తాజాగా విడుదల చేసిన స్టాండర్డ్‌ మ్యాప్‌పై ఆయన స్పందిస్తూ.. ‘ఇది చాలా తీవ్రమైన విషయం. వారు మన భూభాగాన్ని గుంజుకున్నారు. LIVE: Gruha […]

  • చైనా మ్యాప్‌పై ప్రధాని నోరు తెరవాలి
  • ఇది చాలా తీవ్రమైన అంశం

Rahul Gandhi | న్యూఢిల్లీ : లద్దాఖ్‌లో చైనా, భారత్‌ భూ వివాదంపై ప్రధాని మోదీ అనేక సంవత్సరాలుగా జాతికి అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ విమర్శించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయి చిన్‌ ప్రాంతాలు కూడా తమవేనంటూ చైనా తాజాగా విడుదల చేసిన స్టాండర్డ్‌ మ్యాప్‌పై ఆయన స్పందిస్తూ.. ‘ఇది చాలా తీవ్రమైన విషయం. వారు మన భూభాగాన్ని గుంజుకున్నారు.

ప్రధాని దీని గురించి మాట్లాడాలి’ అన్నారు. ‘ఈ మధ్య నేను లద్దాఖ్‌ వెళ్లి వచ్చాను. లద్దాఖ్‌లో అంగుళం భూమి కూడా మనది పోలేదని ప్రధాని చెప్పే మాట అబద్ధమని నేను సంవత్సరాలుగా చెబుతున్నాను. మొత్తం భూభాగాన్ని చైనా ఆక్రమించిందని లద్దాఖ్‌ మొత్తానికీ తెలుసు’ అని రాహుల్‌గాంధీ చెప్పారు.

Updated On 30 Aug 2023 9:39 AM GMT
somu

somu

Next Story