Shashi Tharoor | విప‌క్షాల కూట‌మి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకే అధికార పార్టీ బీజేపీ ఇండియా పేరును భార‌త్‌గా మారుస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స్పందించారు. విప‌క్షాలు త‌మ కూట‌మికి భార‌త్ అని పేరు పెట్టుకోవాల‌ని శ‌శిథ‌రూర్ సూచించారు. అప్పుడే అధికార పక్షం పేర్లు మార్చే వికృత చ‌ర్య‌ను ఆపేసే అవకాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు బదులు ‘భారత్‌’ అని అర్థం వచ్చే […]

Shashi Tharoor |

విప‌క్షాల కూట‌మి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకే అధికార పార్టీ బీజేపీ ఇండియా పేరును భార‌త్‌గా మారుస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స్పందించారు. విప‌క్షాలు త‌మ కూట‌మికి భార‌త్ అని పేరు పెట్టుకోవాల‌ని శ‌శిథ‌రూర్ సూచించారు.

అప్పుడే అధికార పక్షం పేర్లు మార్చే వికృత చ‌ర్య‌ను ఆపేసే అవకాశం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు బదులు ‘భారత్‌’ అని అర్థం వచ్చే పేరు పెట్టుకోవాలి. భారత్‌ అంటే.. అలయన్స్‌ ఫర్‌ బెటర్‌మెంట్‌, హర్మనీ అండ్‌ రెస్పాన్సిబుల్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఫర్‌ టుమారో (BHARAT)’ అని ఎంపీ శ‌శిథ‌రూర్ వివరించారు.

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న జీ20 స‌మ్మిట్‌కు ప్ర‌పంచ దేశాల అధినేత‌లు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌పంచ దేశాల అధినేత‌ల‌కు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము విందు ఏర్పాటు చేయ‌నున్నారు.

ఈ క్ర‌మంలో విందు ఆహ్వాన లేఖ‌ల‌పై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బ‌దులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని రాసి ఉండ‌టంతో.. ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆహ్వాన లేఖ‌ల‌పై రాజకీయ దుమారం రేగుతూనే ఉంది. అంతే కాదు.. ఏషియాన్ స‌ద‌స్సుకు హాజ‌రైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫ్ భార‌త్ అని ఆహ్వానించారు

Updated On 7 Sep 2023 11:31 AM GMT
somu

somu

Next Story