Jio AirFiber | రిలయన్స్‌ ఎయిర్‌ ఫైబర్‌ను మంగళవారం కంపెనీ ప్రారంభించింది. గృహ వినియోగదారులతో పాటు కార్యాలయాలకు సైతం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో ఎయిర్ ఫైబర్ 1.5 GBPS స్పీడ్‌తో ఇంటర్నెట్‌ అందివ్వనున్నది. ఇది ఆన్‌లైన్‌లో హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్ తదితర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అయితే, వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ ఫైబర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ ఏడాది […]

Jio AirFiber |

రిలయన్స్‌ ఎయిర్‌ ఫైబర్‌ను మంగళవారం కంపెనీ ప్రారంభించింది. గృహ వినియోగదారులతో పాటు కార్యాలయాలకు సైతం సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. జియో ఎయిర్ ఫైబర్ 1.5 GBPS స్పీడ్‌తో ఇంటర్నెట్‌ అందివ్వనున్నది. ఇది ఆన్‌లైన్‌లో హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్ తదితర కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

అయితే, వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ ఫైబర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ ఏడాది ఆగస్టులో జరిగిన వార్షిక సభ్య సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఎయిర్‌ ఫైబర్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే పలుచోట్ల ఎయిర్‌టెల్‌ ఫైబర్‌ అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం జియ ఫైబర్‌ ధరను రూ.6వేలుగా అంచనా వేస్తున్నది. హైస్పీడ్‌ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడానికి 5G టెక్నాలజీని వినియోగించుకోవచ్చు.

జియో ఎయిర్‌ ఫైబర్‌ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ సొల్యూషన్, ఇది ఇళ్లు, ఆఫీసులకు 1 Gbps వరకు హైస్పీడ్ కనెక్టివిటీని అందిస్తుండగా.. జియో ఎయిర్‌ఫైబర్‌తో కోట్లాది కుటుంబాలు ప్రపంచస్థాయి డిజిటల్‌ వినోదం, బ్రాడ్‌బ్యాండ్‌, స్మార్ట్‌ హోమ్‌ సేవలను పొందుతాయని రిలయన్స్‌ జియో పేర్కొంది. ఇప్పటికే జియోఫైబర్‌తో కోటి మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నామని, ప్రతినెలా లక్షలాది మంది ఖాతాదారులు చేరుతున్నారని, జియో ఎయిర్‌ఫైబర్‌తో మరిన్ని గృహాలకు చేరువకానున్నట్లు రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

జియో ఎయిర్‌ ఫైబర్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, సెట్-టాప్ బాక్స్‌లతో సహా బహుళ పరికరాలను ఇందులోనే ఉంటాయి. ప్రస్తుత జియో వైర్డ్‌ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌పై ఆధారపడుతుండగా.. ఎయిర్‌ ఫైబర్‌లో వెర్‌లైన్‌ విధానంలో పని చేస్తున్నది. వైర్‌లెస్ ఆధారంగా పని చేస్తుంది. ఇకపై కేబుల్‌ అవసరం ఉండదు. జియో టవర్లతో స్పష్టమైన లైన్‌ ఆఫ్‌ సైట్‌ కమ్యూనికేషన్‌పై ఆధారపడి పని చేస్తుంది.

జియో ఫైబర్‌లో 1 Gbps వేగాన్ని అందిస్తుండగా.. ఎయిర్‌ ఫైబర్‌లో 1.5 Gbps వరకు స్పీడ్‌ రానుంది. అయితే, ఇది టవర్‌ ఫెసిలిటీని బట్టి మారుతుంది. జియో ఎయిర్ ఫైబర్ ప్రస్తుతం హైదరాబాద్‌తో సహా ఎనిమిది నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, ముంబయి, పుణే నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇక జియో ఎయిర్‌ ఫైబర్‌లో 550కుపైగా డిజిటల్‌ టీవీ ఛానెల్స్‌తో పాటు 16కు పైగా ఓటీటీ యాప్‌లు, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, స్మార్ట్‌హోమ్‌ సేవలు పొందవచ్చు. అయితే, జియో ప్యాకేజీలను సైతం ప్రకటించింది. రూ.500 నుంచి రూ.3999 వరకు ప్యాకేజీలను ప్రకటించింది. ఆరు నెలల నుంచి 12 నెలల వ్యాలిడిటీతో ప్యాకేజీలు ప్రకటించి.. ప్లాన్‌కు అనుగుణంగా జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated On 20 Sep 2023 4:40 AM GMT
cm

cm

Next Story