- రేగొడు మండలం చౌదరిపల్లిలో ఘటన
- విచారణ చేపట్టిన పోలీసులు
విధాత, మెదక్ బ్యూరో: భార్యను అతికిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేసి, శవాన్ని వాగులో పడేసిన సంఘటన మెదక్ జిల్లా రెగొడు మండలం చౌదరి పల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే చౌదరి పల్లిలో నివాసం ఉంటున్న కేశయ్య భార్య లక్ష్మి(25) పై అనుమానంతో కత్తితో పొడిచి చంపి వేసి శవాన్ని వాగులో పడేశాడు. కుటుంబ కలహాలతో భర్త కేశయ్యకు దూరంగా భార్య లక్ష్మి నివాసం ఉంటుంది.
ఈ క్రమంలో భర్త కే శయ్య లక్ష్మి ఇంట్లోకి చొరబడి కత్తితో దారుణంగా లక్ష్మిని హత్య చేశాడు. అడ్డు వచ్చిన లక్ష్మి అక్కపై దాడి చేశాడు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
కేశయ్య మరో వివాహం చేసుకున్నట్టు తెలిసింది. దీంతో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరాయి. ఈ కలహాల వల్లే లక్ష్మిని హత్య చేసి ఉంటాడని ప్రాథమిక విచారణకు వచ్చారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.