Mutton Curry | మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..!
Mutton Curry | ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్( Non Veg ) ప్రియులకు మాంసాహారం గుర్తుకు వస్తుంది. చికెనో, మటనో, చేపలో తినేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది మటన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మటన్( Mutton )లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్‌తో పాటు అన్ని రకాల పోషకాలు కూడా లభిస్తాయి. మరి అలాంటి మటన్ కర్రీని కొంచెం రుచిగా వండుకుని తింటే.. ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. కాబట్టి మటన్ కర్రీని ఇలా ట్రై […]

Mutton Curry | ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్( Non Veg ) ప్రియులకు మాంసాహారం గుర్తుకు వస్తుంది. చికెనో, మటనో, చేపలో తినేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది మటన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మటన్( Mutton )లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్‌తో పాటు అన్ని రకాల పోషకాలు కూడా లభిస్తాయి. మరి అలాంటి మటన్ కర్రీని కొంచెం రుచిగా వండుకుని తింటే.. ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. కాబట్టి మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి.
మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇవే..
అర కిలో మటన్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కరివేపాకు ఒక రెబ్బ, కొత్తిమీర, పచ్చి మిర్చి 4, యాలకులు - 2, లవంగాలు -3, దాల్చిన చెక్క-2, సాజీరా ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత, రెండు టీ స్పూన్ల కారం పొడి, పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటా(1), ధనియాల పొడి, గరం మాసాలా ఒక టీస్పూన్.
తయారీ విధానం..
ముందుగా మటన్‌ను స్వచ్ఛమైన నీటితో శుభ్రంగా కడగాలి. కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను మటన్‌కు బాగా పట్టించి, 20 నిమిషాల పాటు ఓ గిన్నెలో ఉంచాలి. ఇక పొయ్యి వెలిగించి, కుక్కర్‌లో నూనె వేసి మరిగించాలి. వేడి కాగానే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరాను వేసి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి. ఇవి రంగు మారిన తర్వాత టమాటాలను వేసి మెత్తగా ఉడికించాలి.
టమాటా మెత్తగా ఉడికిన తర్వాత మటన్‌ను అందులో వేయాలి. 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. అనంతరం తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయాలి. 3 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మటన్‌ను ఉడికించాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టౌవ్ బంద్ చేయాలి. రుచిగా తయారైన మటన్ కర్రీని.. చపాతీ, అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
