Naga Chaitanya | టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని… కొంతకాలం కాపురం చేసిన తరువాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం ఎవరికీ వారే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి రకరకాలుగా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వారి వివాహ బంధం పెటాకులవడానికి కారణం నాగచైతన్యనే అని కొందరు… కాదు […]

Naga Chaitanya |
టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు పొందిన అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని… కొంతకాలం కాపురం చేసిన తరువాత ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
విడాకుల అనంతరం ఎవరికీ వారే ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నా.. సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి రకరకాలుగా గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వారి వివాహ బంధం పెటాకులవడానికి కారణం నాగచైతన్యనే అని కొందరు… కాదు సమంతనే తనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలని విడిపోయినట్లుగా.. ఇలా రకరకాలుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అసలెందుకు వారిద్దరూ విడిపోయారనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ రాలేదు. ఇచ్చేవారు కూడా లేరనుకోండి అదే విషయం.
అయితే ఎన్ని గాసిప్స్ వినిపిస్తున్నా.. అటు అక్కినేని ఫ్యామిలీ, ఇటు సమంత.. ఎవరి పనివారు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా చైతూ, సమంత ఇవేమీ పట్టించుకోకుండా వారి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. చైతూ తన తదుపరి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టి బిజీగా ఉండగా.. సమంత తనకున్న అనారోగ్యం నుంచి బయటపడేందుకు అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. దీనికోసం కొన్నాళ్లపాటు సినిమాలకు కూడా ఆమె ఫుల్‌స్టాప్ పెట్టింది.
ఇదిలా ఉండగా ఈ మధ్య నాగార్జున నోటివెంట సమంత పేరు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ సీజన్ 7 వేదిక మీద విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ.. మేము త్వరలోనే సమంతని కలవబోతున్నామని అన్నారు. అంటే దీనర్థం నేరుగా సమంతని కలుస్తారనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే.
సమంత, విజయదేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ మూవీని చూసేందుకుగానూ నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కి వెళ్లనున్నట్లుగా స్టేజ్‌పై ప్రకటించారు. కానీ నాగచైతన్య మాత్రం అవేమి పట్టనట్లే కనిపిస్తున్నాడు. ఇప్పుడు నాగార్జున ఏమో ఇలా సమంత నటించిన మూవీకి ఫ్యామిలీతో సహా వెళ్తాననడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
నాగార్జున మాటల్ని బట్టి చూస్తే వీరు విడిపోయినప్పటికీ వీరి మధ్య ఇంకా ఫ్రెండ్‌షిప్ నడుస్తుందా అన్న అనుమానాలను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి ‘ఖుషి’ సినిమాకి నాన్న మాట ఇచ్చాడు కాబట్టి చైతూ కూడా వెళతాడా? ఏమో చెప్పలేం.. చూడాల్సిందే.
