Naga Chaitanya | విధాత: సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగ చైతన్య లైఫ్ గురించి.. అతను ఏం చేస్తున్నాడా అనే క్యూరియాసిటీ చాలా ఎక్కువగానే చూపిస్తున్నారు సోషల్ మీడియా ఫాలోయర్స్, అభిమానులు. విడాకుల తర్వాత చాలా కాలం సోషల్ మీడియాలో ఏదో వార్తలో నాగ చైతన్య కనిపిస్తూనే ఉన్నాడు. ఇక సమంత ‘ఖుషి’ మూవీ రిలీజ్ తర్వాత సమంత లిప్ కిస్ సీన్ చూసి చైతూ బాధ పడే ఉంటాడని.. విజయ్ దేవరకొండ మీద రివేంజ్ […]

Naga Chaitanya |

విధాత: సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగ చైతన్య లైఫ్ గురించి.. అతను ఏం చేస్తున్నాడా అనే క్యూరియాసిటీ చాలా ఎక్కువగానే చూపిస్తున్నారు సోషల్ మీడియా ఫాలోయర్స్, అభిమానులు. విడాకుల తర్వాత చాలా కాలం సోషల్ మీడియాలో ఏదో వార్తలో నాగ చైతన్య కనిపిస్తూనే ఉన్నాడు.

ఇక సమంత ‘ఖుషి’ మూవీ రిలీజ్ తర్వాత సమంత లిప్ కిస్ సీన్ చూసి చైతూ బాధ పడే ఉంటాడని.. విజయ్ దేవరకొండ మీద రివేంజ్ కోసం తర్వాత తను చేయబోయే సినిమాలో రష్మికా మందన్నాను హీరోయిన్‌గా తీసుకుంటాడని.. ఆమెకి కూడా ఘాటుగా లిప్ కిస్ ఇస్తాడని.. ఇలా రకరకాల కామెంట్స్ రూమర్స్ రూపంలో నెట్టింట చక్కర్లు కొట్టాయి.

ఇంత రచ్చ జరుగుతున్నా, నాగ చైతన్య నిమ్మకు నీరెత్తినట్టు తన పనిలో తనున్నాడు. గతంలో చైతన్య రెండో పెళ్లి విషయంలోనూ ఇదే తంతు నడిచింది. నటి శోభిత ధూళిపాళతో నాగ చైతన్య రిలేషన్‌లో ఉన్నాడంటూ టాక్ నడిచింది.

అయితే దీనిని నిజం చేస్తూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ఓ రెస్టారెంట్లో కనిపించారు. రూమర్స్ నిజమే అనుకున్నారు. కానీ వాటిని శోభిత ఖండించింది. అయితే నాగ చైతన్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ సైలెంట్ మోడ్ లోనే ఉండిపోవడం విశేషం.

అయితే నిజం దాస్తే దాగుతుందా.. శోభిత, నాగ చైతన్య మరోసారి అడ్డంగా దొరికిపోయారు. రిలేషన్‌లో ఉన్నారు అని కన్ఫామ్ చేయడానికి మరో ఉదహరణ వచ్చేసింది. అదేంటంటే? శోభిత తాజాగా ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది.

ఆ ఫోటోలో శోభిత.. గ్రీన్ లైట్స్ అనే పుస్తకం పట్టుకున్న ఫోటో కింద.. నేను చదువుతున్న అత్యుత్తమ పుస్తకాల్లో గ్రీన్ లైట్స్ ఒకటి. దీనిలో ఉన్న జీవిత కథ ఒక మంచి పాటలా ఉంటుంది. దీన్ని చదివిన తర్వాత ఏదో ఫ్రీడమ్ వచ్చిన ఫీల్ ఉంది అంటూ కామెంట్స్ చేసింది.

గతంలో నాగ చైతన్య కూడా ఇదే పుస్తకాన్ని చదువుతున్నానని, సరిగ్గా ఇవే వాక్యాల్ని కాస్త అటు ఇటుగా రాశాడు. అయితే అవే ఇప్పుడు శోభిత కూడా చెప్పడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందనే విషయాన్ని నిజం చేస్తున్నారని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్ నెట్టింట వైరల్ అవుతుంది

Updated On 7 Sep 2023 1:12 PM GMT
somu

somu

Next Story