Nagababu | Dubai
విధాత: జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీని ఎన్నికలవైపు నడిపించే విషయంలో గ్రామస్థాయి.. జిల్లా స్థాయిల్లో ఎలాంటి చర్యలు తీసుకోకున్నా డబ్బుల విషయంలో మాత్రం జోరుగా ఉన్నారని అంటున్నారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి పవన్ ఎలాంటి అడుగులు వేయడం లేదు.
అసలు ఏ జిల్లాకు ఎవరు అధ్యక్షుడో తెలియదు.. అందరూ పార్టీ నాయకుడు, సీనియర్ నాయకుడు అని చెప్పుకోవడమే తప్ప ఎవరికి ఏ బాధ్యత ఉందొ తెలీదు.. ఇక మండలాల్లో ఐతే అసలు ఉనికి లేదు.. వాస్తవానికి పవన్, నాదెండ్ల మనోహర్.. నాగబాబు మినహా పార్టీలో ఇంకో కొత్త ముఖమే కనిపించడం లేదు.
టిడిపితో పొత్తు.. ఎక్కడ ఎన్ని సీట్లు ఎవరికీ కేటాయిస్తారన్నది తెలియని పరిస్థితి. దీంతో పార్టీలోకి కొత్త ముఖాలు రావడం లేదు. మరోవైపు జగన్ మాత్రం ఆయన్ను చంద్రబాబు ఆరోవేలుగాను. దత్తపుత్రుడి గాను పోలుస్తూ వెక్కిరిస్తున్నారు.
We deeply appreciate the hardworking individuals from Dubai and the Gulf countries. Their contributions have been instrumental in shaping Janasena’s mission for a brighter future of progress and unity. pic.twitter.com/nRyQPYt3Ds
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 26, 2023
దిలా ఉండగా పార్టీకి క్యాడర్ అక్కర్లేదు.. బలం అక్కర్లేదు.. నాయకులూ అక్కర్లేదు. కార్యకర్తలూ అక్కర్లేదు కానీ నిధులు మాత్రం కావాలి అని పవన్ భావిస్తున్నట్లు ఉంది. ఈమేరకు నిధుల వసూళ్లకు అన్నట్లుగా మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌కి నాగబాబు చేరుకున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకూ దుబాయ్‌లో ఉంటారని అంటున్నారు. అక్కడ వివిధ వర్గాల వారిని కలిసి నిధుల సమీకరణ చేస్తారని సమాచారం.
గతంలో కొందరు నాయకులూ ఇష్టానుసారం నిధులు వసూలు చేసి వాడుకున్నారని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ డబ్బుల బాధ్యత మొత్తం నాగబాబుకు అప్పగించారట పవన్ కళ్యాణ్.. అందుకే ఆయన సారథ్యంలో నిధుల సమీకరణ జరుగుతుందని అంటున్నారు. అంటే రానున్న ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ నుంచి నిధులు గట్టిగానే అందుతాయని కార్యకర్తలు అంటున్నారు