విధాత: రెట్టింపు ఉత్సాహంతో శృంగారం చేయాలనుకున్నాడు. అందుకోసం వయాగ్రా( Viagra pills ) వేసుకున్నాడు. రాత్రంతా తన ప్రియురాలితో శృంగారం( Intercourse )లో మునిగి తేలాడు. కానీ తెల్లారేసరికి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు.
ఫోరెన్సిక్, లీగల్ మెడిసిన్ జర్నల్ (Forensic and Legal Medicine )లో ప్రచురితమైన కథనం ప్రకారం.. నాగ్‌పూర్ ( Nagpur ) కు చెందిన ఓ 41 ఏండ్ల వ్యక్తి ఇటీవలే తన ప్రియురాలి( Lover )తో ఓ హోటల్‌కు వెళ్లాడు.
లవర్‌తో సరదాగా గడిపిన అతను ఓ రోజు రాత్రి మద్యం సేవించాడు. మరింత ఉత్సాహంతో ఆమెతో ఎంజాయ్ చేయాలని భావించిన అతను.. మద్యం సేవిస్తూనే రెండు వయాగ్రా పిల్స్(50 ఎంజీ) వేసుకున్నాడు. ఇక రాత్రంతా ఆమెతో తన శక్తికి మించి శృంగారం చేశాడు.
తెల్లారేసరికి తీవ్ర అస్వస్థత, వాంతులు
ఇక తెల్లారేసరికి ఆ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకున్నాడు. దీంతో భయపడ్డ ప్రియురాలు.. ఆస్పత్రికి వెళ్దామని అడగ్గా, అతను తిరస్కరించాడు. గతంలోనూ ఇలాగే అయిందని వాదించాడు. కాసేటికే అతను తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయాడు. దీంతో అతన్ని ప్రియురాలు సమీప ఆస్పత్రికి తరలించింది.
మెదడుకు ఆక్సిజన్ అందక..
ఆస్పత్రికి తీసుకెళ్లిన అతన్ని వైద్యులు పరీక్షించి, ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు. మెదడు(Brain) కు ఆక్సిజన్( Oxygen ) సరఫరా తగ్గిపోయి సెరెబ్రోవాస్కులర్ హెమరేజ్( cerebrovascular haemorrhage ) ఏర్పడింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. మద్యంతో కలిపి వయగ్రా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యాడని వైద్యులు నిర్ధారించారు.
అవగాహన కోసమే..
డాక్టర్ల సలహా లేకుండా అంగస్తంభన కోసం మెడిసిన్స్ తీసుకోవద్దని జర్నల్‌లో సూచించారు. వయాగ్రా వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ అరుదైన కేసును ప్రచురించినట్లు జర్నల్‌లో వెల్లడించారు.